Snake In Refrigerator Video Watch Here: సాధారణంగా అడవుల్లో ఉండాల్సిన పాములు ఇప్పుడు జనావాసాల్లో జీవిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అడవుల్లో ఆహార కోరత ఏర్పడడం కారణంగా ఇలా జనావాసాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పాములు ఇళ్ళలోకి చొరబడి వివిధ వస్తువుల్లో దాగి ఉంటున్నాయి. తెలిసి తెలియక అటు సైడ్ వెళ్లడం వల్ల అవి దాడి చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అయితే చాలామంది ఇలా ఇళ్లలోకి చొరబడిన పాములను ముందుగానే గుర్తించి పాములు పట్టే వారికి సమాచారం అందిస్తున్నారు. వారు వీటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెడుతున్నారు. తాజాగా ఓ ఇంట్లో దూరిన పాము ఏకంగా రిఫ్రిజిరేటర్ లోకి ప్రవేశించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో పాము ఏకంగా రిఫ్రిజిరేటర్ లోకి దూరింది. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లోకి ప్రవేశించిన పాము రిఫ్రిజిరేటర్ లో దూరింది. అయితే ఇంటి యజమాని రిఫ్రిజిరేటర్ తలుపులు ఓపెన్ చేసి చూడగా అతడికి అతి ప్రమాదకరమైన నాగుపాము కనిపించింది. దీంతో ఆ యజమాని రిఫ్రిజిరేటర్ డోర్ ని అలాగే వేసి పాములు పట్టే వారికి సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొని ఆ పామును రెస్క్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఈ వైరల్ అవుతున్న పాముకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో మీమ్స్ కి వినియోగిస్తున్నారు. సమ్మర్ కావడంతో చల్లటి గాలి కోసం రిఫ్రిజిరేటర్ లో పాము దూరిందని వీడియోను మీమ్స్ లాగా మార్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోను నాగిని అనే పాటతో జత చేసి పోస్ట్ చేశారు. దీనిని మీమ్స్ గర్ల్ 2.0 అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో నాలుగు లక్షల మందికి పైగానే సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 5000 మందికి పైగా నెటిజన్స్ లైక్ చేశారు. చాలామంది ఈ వీడియోను చూసి కామెంట్లతో పాటు షేర్ కూడా చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









