)
Snake appears on Ganesh idol amid ganesh Chaturthi Trending Video: సోషల్ మీడియాలో ఇటీవల అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు గణేష్ చతుర్థి పండగ నేపథ్యంలో వినాయకుడి వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో వెరైటీగా ఉన్న గణనాథుల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అంతే కాకుండా వినాయకుల విగ్రహల మీద ఇటీవల ఇటీవల కొన్ని మూగ జీవాలు ఎక్కి మరీ స్వామిని కొలుచుకుంటున్నాయి. ఇటీవల ఒక పిల్లి గణపయ్య విగ్రమం మీద ఎక్కి మరీ అభయ హస్తం మీద కూర్చుంది. మరోవైపు ప్రస్తుతం ఒక నాగు పాము తొండం మీద ఎక్కిన వీడియో వైరల్ గా మారింది.
నాగు పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ మొత్తంగా గణపయ్య విగ్రహం మీద ఎక్కి కూర్చుంది. అది పడగ విప్పి మరీ గణపయ్య తొండం మీద నుంచి పాకుతూ వినాయకుడి విగ్రహం మీద ఎక్కింది. వినాయకుడి విగ్రహంచాలా పెద్దదిగా ఉంది. అది చాలాసేపు తొండం మీద పడగ విప్పీ మరీ కూర్చుంది. అక్కడున్న వారు పామును చూసి ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు.
నాగు పాము సాధారణంగా శివుడి మెడలో ఉంటుంది. అంతేకాకుండా..గణపయ్య కడుపుకు కూడా నాగు పాము చుట్టుకుని ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం నాగు పాము గణపయ్యను తొండం ఎక్కడం చూసి అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
మొత్తంగా పామును తమ సెల్ ఫోన్ లలో రికార్డు చేసిసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అంతా గణపయ్య మహిమ అంటూ జై గణేశా అంటూ భక్తితో కొలుచుకుంటున్నారు.