)
Cobra Snake Attacks on large frog Trending video: సోషల్ మీడియాలో ఇటీవల మనుషుల ఫన్నీ వీడియోలతో పాటు జంతువుల వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం వీటిని ఎక్కువగా చూస్తున్నారు. ముఖ్యంగా పాముల వీడియోలకు ఇటీవల ఒక రేంజ్ లో డిమాండ్ పెరిగింది. ఎక్కడ ఎలాంటి పాముల వీడియోలు కన్పించిన నెటిజన్లు వెంటనే వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పాములు వానాకాలంలో జనావాసాల్లోకి ఎక్కువగా వస్తాయి. పాములకు ఇష్టమైన ఎలుకలు, కప్పల వేటలో అవి అడవుల నుంచి బైటకు వస్తాయి. ఎక్కువగా చెట్లు, చెమలు, చెరువులు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో పాముల కాటు ఘటనలు కూడా వానాకాలంలోనే ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అయితే.. తాజాగా.. ఒక పాము కప్ప మీద భీకరంగా దాడికి దిగింది. ఈ వీడియో వైరల్గా మారింది.
కప్ప పాపం.. అడవిలో తన మానాన తాను బొరియాల్లో చక్కగా కూర్చుని ఉంది. మరీ ఇంతలో దీని వాసన పాముకు వచ్చింది. పాక్కుంటూ కప్ప ఉన్న ప్రదేశంలోకి వెళ్లింది. కప్పకు పామును చూడగానే .. గుండెలో రైళ్లుపరిగెత్తినట్లైంది.
ఇక్కడ తినేస్తుందో అని తెగ భయపడిపోయింది. అయిన ఏ మాత్రం తగ్గెదేల అన్నట్లు పామును చూసి తన ఆకారంను పెంచుకుంది. పాము దాడి చేస్తుంటే.. తాను కూడా ప్రతిదాడికి దిగింది. నువ్వు బుసలు కొడుతుంటే నాకేంటని అన్న విధంగా పాముపైనే ఫైటింగ్ కు దిగింది.
చివరకు కప్ప తెగువకు పాము భయంతో తోక ముడిచింది. మొత్తంగా ఈ ఘటనను కొంత మంది ఫారెస్ట్ సిబ్బంది సీక్రెట్ గా రికార్డు చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే.. పాముకే చుక్కలు చూపించిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.