Snake bite Video: ఇదెక్కడి ఘోరం.. వలలో చిక్కుకున్న పామును కాపాడదామని చూస్తే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

Cobra attacks on snake catcher: వలలో ఒక పాము చిక్కుకుని బైటకు వెళ్లలేక విలవిల్లాడిపోయింది. ఈక్రమంలో అక్కడున్న ఒక స్నేక్ క్యాచర్ ను పామును జాగ్రత్తగా వల నుంచి బైటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 4, 2025, 05:45 PM IST
  • యూపీలో షాకింగ్ ఘటన..
  • పాము కాటుకు గురైన స్నేక్ క్యాచర్..
Snake bite Video: ఇదెక్కడి ఘోరం.. వలలో చిక్కుకున్న పామును కాపాడదామని చూస్తే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

Cobra Snake biting snake catcher while rescuing video: వర్షాకాలంలో పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాములు మనుషుల ఆవాసాల్లోకి ఎక్కువగా వస్తుంటాయి. ఇళ్లలోకి సజ్జల మీద, బట్టలో , షూస్ లలో, చీకటి ప్రదేశాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పాముల వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే దూరంగా పారిపోతారు.

Add Zee News as a Preferred Source

కానీ కొంత మంది మాత్రం పాముల్ని కాపాడి అడవుల్లో వదిలేస్తారు. కొన్నిసార్లు స్నేక్ క్యాచర్ లు పాముల్ని పట్టుకునేటప్పుడు అనుకొని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.  ముఖ్యంగా పాములు.. కోపంలో తిరిగి స్నేక్ క్యాచర్ ల మీద దాడి చేసి కాటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

కొంత మంది స్నేక్ క్యాచర్ లు తమ ప్రాణాల్ని సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

 ఉత్తర ప్రదేశ్‌ లో జౌన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఒక నాగు పాము చేపల కోసం పెట్టిన వలలో చిక్కుకుంది. ఇంతలో అక్కడున్న వారు స్నేక్ క్యాచర్ అయిన మురళి వాలేకు సమాచారం ఇచ్చారు. అతను వెంటనే అక్కడకు చేరుకుని పామును కాపాడేందుకు ప్రయత్నించాడు.

మరీ ఇంతలో ఆ పాముకు ఏమన్పించిందో కానీ.. ఒక్కసారిగా అతని చేతిపై బలంగా కాటు వేసింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ పరిణామంతో  అక్కడున్న వారు మురళి వాలేను ఆస్పత్రికి తరలించారు.

Read more: Snakes Attack Video: ఇది భయ్యా.. అసలైన ధైర్యం... రెండు పాములు కాటేస్తున్న తలొగ్గని కప్ప.. షాకింగ్ వీడియో..

ప్రస్తుతం అతనికి వైద్యం జరుగుతుంది. కండీషన్ మాత్రం సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పామును కాపాడాలని చూస్తే.. అతని ప్రాణాల మీదకు వచ్చినట్లైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News