Cobra Snake dancing video going viral on social media: సాధారణంగా ప్రాణాల మీద ఆశలు ఉన్న వారు ఎవరైన పాముల్ని చూస్తే దూరంగా పారిపోతారు. కొంత మంది పాముల పేర్లు ఎత్తేందుకు కూడా సాహాసం చేయరు. పొరపాటున ఎక్కడైన పాము కన్పిస్తే మరల ఆ ప్రదేశంకు అస్సలు పొరు. అంతేకాకుండా పాముల నుంచి తప్పించుకొవడానికి అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తారు. ఇంటి చుట్లు పొదలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పాత సామానులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇదంతా మనం చూస్తుంటాం. పాములు ఇటీవల చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని పాములు మొబైల్ ఫోన్ల లో డ్యాన్స్ వీడియోలు చూస్తున్నాయి. మరికొన్ని రోడ్ల మీద రొమాన్స్ లుచేసుకుంటున్నాయి. ఏకంగా ఇళ్లలోకి అది కూడా బీరువాల్లోకి దూరిపోతున్నాయి. మొత్తంగా కోబ్రాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పాము ఒక కర్ర తలుపు సందులో నుంచి బైటకు వచ్చింది. అంతటితో ఆగకుండా.. అది అటు ఇటు చూస్తు డ్యాన్స్ చేసింది. అచ్చం అదేదో మైకెల్ జాక్సన్ లా మెలికలు తిరుగుతూ మరీ పాము డ్యాన్స్ చేస్తు రెచ్చిపోయింది. అది బుసలు కొడుతూ, మరీ మెలికలు తిరుగుతూ భలే ట్విస్ట్ లు ఇచ్చింది.
అక్కడున్న వారంతా.. పాము డ్యాన్స్ ను వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతొ అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాము ఏంట్రా బాబు అలా డ్యాన్స్ చేస్తుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నాగు పాము కూడా భలే వెరైటీగా ఉంది. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.








