)
Cobra Snake found inside steel locker room video: సాధారణంగా పాములు నిధులు, బంగారం ఉన్న చోట ఎక్కువగా ఉంటాయంటారు. అందుకే ఎవరి ఇంట్లో అయిన తరచుగా పాము పిల్లలు లేదా పెద్ద పాములు కన్పిస్తే ఆ ఇంట్లో ఎక్కడైన నిధులు దొరుకుతాయని కూడా వెతుకుతుంటారు. ముఖ్యంగా పాములు నిధులకు కాపాలాగా ఉంటాయని, వాటిని కొంత మందికే దక్కెలా చేస్తాయంటారు.
ఇవి తరచుగా మనం వింటూ ఉంటాం. ఇటీవల పాములకు చెందిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా కోబ్రాల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా అడవులు, దట్టమైన కొండలు ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చాలా మంది తమ ఇంటిలో పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. ఇటీవల పాములు బెడ్ ల కింద, షూస్ లలో, స్కూటీ డిక్కీలో దూరిన నక్కిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా.. ఒక నాగు పాము ఏకంగా బెడ్ రూమ్ లో ఉన్న బీరువా లాకర్ లో దూరింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
हमेशा सिर्फ सुना था आज देख भी लिया। ?
पुराने लोगों से दादा और दादी से सुनता चला आ रहा हुँ,की पहले जहाँ भी जमीन मे धन गड़ा होता था, उसकी रक्षा सर्प करते थे।
लेकिन ये लोहे की अलमारी, तीजोरी मे कैसे पहुँच गया, यहाँ का पता किसने दिया इसको। pic.twitter.com/UVcnWPcK3x
— Abhishek Agrahari (@abhishek902444) September 25, 2025
చాలా మంది డబ్బుల్ని, బంగారంను లాకర్ లలో పెట్టుకుంటారు. బీరువాను ఎంతో జాగ్రత్తగా కనిపెడుతుంటారు. అయితే.. ఒక పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. నేరుగా బీరువాలోకి ప్రవేశించింది. అది కూడా నేరుగా లాకర్ లోకి వెళ్లి డబ్బులు,బంగారం ఉన్న ప్రదేశంలో కూర్చుంది. ఇంతలో ఇంట్లొని వారు బీరువా ఓపెన్ చేయగానే బుసలు కొడుతూ కాటు వేసేందుకుప్రయత్నించింది.
వెంటనే వారు తెరుకుని పాముల్ని పట్టుకునే వారికి సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ అక్కడకు చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అది కోపంతో పలుమార్లు కాటు వేసేందుకు ప్రయత్నించింది.
అదేదోదాని అడ్డా అయినట్లు ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఎన్నోగంటల పాటు కష్టపడి మరీ ఆపామును చివరకు బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే అంటూ షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook