)
Cobra snake in found inside toilet video: వానాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాములు ఇళ్లలోకి ఎక్కువగా వస్తుంటాయి. పాములు బూట్లలో, సజ్జల మీద, బెడ్ ల కింద కూడా ఇటీవల దూరిపోతున్నాయి. ప్రస్తుతం పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు.
గుజరాత్ లోని వాపిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. వాపిలోని శ్రీ రంగ్ సొసైటీకి చెందిన ఒక కుటుంబం ఇంట్లో ఈ ఘటన సంభవించింది. రోజులాగే సదరు ఇంట్లో ఉన్న వ్యక్తులు వాష్ రూమ్ కు వెళ్దామని చూశాడు. అక్కడ కొన్ని చెట్లు, గ్రీనరి కూడా ఉంది.
ఈ నేపథ్యంలో మరీ ఎలా వచ్చిందో కానీ.. ఒక పెద్ద నాగు పాము వచ్చి, ఆ వాష్ రూమ్ లోకి వెళ్లిపోయి నక్కింది. అక్కడున్న వారు.. ఆ కోబ్రాను చూడగానే షాక్ అయ్యారు. అది కోపంగా బుసలు కొడుతూ... వాళ్ల మీదకు దాడులు చేసేందుకు కూడా ప్రయత్నించిది. ఇంతలో వాళ్లు డోర్ క్లోజ్ చేసి స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును చాకచక్యంగా పట్టుకుని మరీ దాన్ని బంధించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పాము మాత్రం వాళ్లకు అస్సలు దొరకలేదు. మొత్తంగా పాము వాష్ రూమ్ లోకి హోల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
అతను మాత్రం చాకచక్యంగా ఆ పామును బంధించడానికి ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వకుండా ఈ టెన్షన్ ఏంట్రా బాబు అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.