)
Cobra Snake hulchul in bed room Trending Video: వానాకాలంలో పాములు జనావాసాల్లోకి తరచుగా వస్తుంటాయి. ఇలాంటి ఘటనలు మనం ఎక్కువగా చూస్తుంటాం. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో నుంచి పాములు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి వస్తాయి. ఇలాంటి ఘటనలు మనం చూస్తుంటాం. అంతే కాకుండా వానాకాలంలోనే పాముల కాటుకు చెందిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి.
అందుకే వానాకాలంలో పొలాలకు వెళ్లే వారు, చెట్ల దగ్గరకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పాము బెడ్ రూమ్ లోకి ప్రవేశించింది. మరీ అది ఎలా వెళ్లిందో కానీ.. మొత్తంగా అక్కడి వాళ్లకు చుక్కలుచూపించింది. భారీ నాగు పాము.. బెడ్ రూమ్ లో ఉండటంను ఆ ఇంట్లో వారు గుర్తించారు. వెంటనే ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.
కానీ ఆ పాము మాత్రం తెగ హల్ చల్ చేసింది. డోర్ ల మీదకు ఎక్కింది. అక్కడున్న బెడ్ మీద, విండోలు ఎక్కుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు నానా పాట్లు పడింది. కానీ ఆ పాముకు బైటకు వెళ్లే మార్గందొరక్క పాపం.. చాలా సేపు అక్కడ రచ్చ చేసింది.
చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ ఘటన ఆ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.