)
Cobra Snake hulchul on Road ai video goes viral: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రక రకాల వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. మరికొన్ని వీడియోలను చూస్తే షాక్ కు గురిచేసేవిలా ఉంటాయి. ముఖ్యంగా కొంత మంది నెటిజన్లు మాత్రం ఇటీవల వైరల్ అవుతున్న ఏఐ వీడియోలను చూసి తెల్లముఖం వేస్తున్నారు. ఇటీవల ఏఐ వీడియోలు డీప్ ఫెక్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు బాగా ఆసక్తిగా చూస్తున్నారు.
మొత్తంగా వీరి వల్ల కొన్నిసార్లు అసలు వైరల్ అవుతున్న వాటిల్లో నిజం ఏంటో.. అబద్దం ఏంటో కూడా తెలియకుండా చాలా మంది బిత్తరపోతున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారింది. దీనిలో ఒక పాము నడి రోడ్డు మీద హల్ చల్ చేస్తుంది. ఆ తర్వాత ఉన్నట్లుండి ఒక్కసారిగా పడగ విప్పి మరీ నడుము కన్నా..పైకి ఎత్తు నిలబడింది.
ఈ ఘటన చూసి అందరు షాక్ అయ్యారు. అప్పుడే దానికి పడగ మీద రెక్కలు వచ్చినట్లు అది తోక మీద ప్రయాణించింది. ఈ వీడియోను నెట్టింట బాగా వైరల్ చేస్తున్నారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. అది ఏఐ వీడియో.. అంటే ఫెక్ . దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారన్న మాట.
మొత్తంగా ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం తెలియని కొంత మంది నెటిజన్లు ఇది నిజమనుకునిపప్పులో కాల్లు వేస్తున్నారు. మొత్తంగా ఇలాంటి ఫెక్ వీడియోలు ఎందుకు వైరల్ చేస్తున్నారని మరికొంత మంది నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.