)
Snake silently entered on bed video: వానాకాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తాయి. ముఖ్యంగా అడవులు, కొండలు ఉన్న ప్రదేశాల్లో కోబ్రాలు ఎక్కువగా సంచారం చేస్తాయి. పొలాల్లో వెళ్లిన వారు ఈ సీజన్ లలోనే ఎక్కువగా పాము కాటుకు గురౌతుంటారు. పాములు స్కూటీల్లో, బూట్లలో, బెడ్ షిట్లలో, సజ్జల మీద ఎక్కువగా నక్కి దాక్కుంటాయి.
ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తుంటాం. కానీ పాము కాటుతో చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు. కొంత మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. ఈ క్రమంలో పాములు ఇటీవల ఇంట్లో ఉన్న రంధ్రాలు, గోడల గుండా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం ఒక భారీ సర్పం ఏకంగా బెడ్ మీద దూరిపోయి తెగ హల్ చల్ చేసింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
యువతి బెడ్ మీద పడుకుని ఉంది. ఇంతలో ఒక భారీ సర్పం అక్కడకు వచ్చింది. మరీ ఆమె మాత్రం గాఢమైన నిద్రలో ఉంది. కోబ్రా మాత్రం మెల్లగా బెడ్ మీదకు ఎక్కేసి ఆమె పక్కలోకి దూరిపోయింది. బెడ్ షిట్ లోకి నక్కి కూర్చుంది. మరీ ఆమె నిద్రలో ఉండటంతో ఆమెకు ఈ ఘటన తెలియలేదు.
ఆ తర్వాత అక్కడి వారు ఏదో తోక కన్పిస్తుందని చూడగా పెద్ద పాము కన్పించింది. వెంటనే స్నేక్ హెల్పర్ లకు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి చాకచక్యంగా పామును బంధించాడు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలో వదిలేసి వచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు.