)
cobra snake slithers into womens clothing as she sleeps video: వర్షాకాలంలో పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉండే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఇంటి చుట్టుపక్కల గుబురుగా చెట్లను పెంచుకొకుండా.. జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. వరద నీళ్లలో పాములు కొట్టుకుని వచ్చిన ఘటనలు చూస్తుంటాం.
ఇంట్లో కింద పడుకొకుండా బెడ్ మీద పడుకొవాలని పెద్దలు చెబుతారు. కొన్నిసార్లు పాములు రాత్రిళ్లు ఇళ్లలోకి ఎలుకల కోసం దూరి వస్తాయి. ఆ సమయంలో అవి కాటు వేసే అవకాశం ఉంటుంది. అందుకే పాములతో వర్షకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈక్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక యువతి నెల మీద పడుకుని ఉంది. అయితే.. ఎలా వచ్చిందో కానీ.. ఒక పాము ఆమె దగ్గరకు వచ్చింది. మెల్లగా పాక్కుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లి నడుము మీద నుంచి దిండు కిందకు వెళ్లింది. ఏదో ఒంటి మీద నుంచి వెళ్లినట్లు అన్పించగానే .. షాక్ తో ఆమె నిద్రనుంచి లేచింది. ఇంతలో భారీ సర్పం ఆమె నడుము మీద నుంచి వెళ్లడం గమనించింది.
వెంటనే భయంతో కేకలు పెడుతూ.. అక్కడి నుంచి లేచి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు .. ఆ యువతి లక్ బాగుందేమో.. పాపం.. బతికి పోయిందని కామెంట్లు చేస్తున్నారు.