)
Cobra Snake smoking cigarette and drinking alcohol ai generated video: పాముల వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఎక్కడ, ఎలాంటి పాములు కన్పించిన కూడా వెంటనే వాటిని తమ ఫోన్ లలో రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కోబ్రా స్నేక్ లు ఎక్కువగా వానాకాలంలో అడవుల నుంచి బైటకు వస్తాయి. ఇటీవల ఏఐ జనరేటేడ్ వీడియోలు కూడా నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. డీప్ ఫెక్ ల రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అసలు నెట్టింట కొన్ని సార్లు వైరల్ అవుతున్న వీడియోల్లో అసలు ఏది నిజమైనవో.. మరేంటీ ఫెక్ వీడియోలో అస్సలు తెలియడంలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
దీనిలో పాము బెంచ్ మీద పడగవిప్పీ ఉంది. కింద ఉన్న సిగరెట్ ను నోట్లో పెట్టుకుంది. లిక్కర్ ను తాగుతూ తెగ రచ్చ చేసింది. కోబ్రా మాత్రం అచ్చం మనుషుల్లా దమ్ముకొడుతూ, లిక్కర్ తాగుతూ చిల్ అవుతుంది. ఈవీడియో వైరల్ అవుతుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది ఏఐ జనరేటేడ్ వీడియో. చాలా మంది తొలుత దీన్నిచూసి నిజమైన పామో ఏంటో అని కంగారుపడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెడుతున్నారు. ఈ క్రమంలో ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.