Cobra Snake spotted on shiva lingam video: సాధారణంగా సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా నెటిజన్లు ఇటీవల కాలంలో పాములు వీడియోలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాముల వీడియోలు కొన్ని చూస్తుంటే భయంకరంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే చాలా భక్తి భావన కూడా కల్గుతుంది.
ఈ క్రమంలో చాలా మంది పాములు కన్పిస్తే భయంతో దూరంగా పారిపోతారు. మరికొంత మంది పాములు కాటు వేస్తే పైశాచికంగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో పాములు శివుడి మెడలో ఉంటాయని, అవి దైవ స్వరూపంగా చాలా మంది భావిస్తారు. పాములకు ఆపదకల్గజేయకూడదని చెబుతుంటారు.
పాములకు ఆపదకల్గజేస్తే కాలసర్పదోషం చుట్టుకుంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని చెర్లపల్లిలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.ఒక పాము తెల్లవారు జామున శివలింగంపైకి ఎక్కి బుసలు కొడుతూ చాలా సేపు అలానే ఉండిపోయింది. ఉదయం పూట గుడికి దగ్గర పడుకునే పూజారీ ఏదో చప్పుడు వస్తుందని శివాలయంలో చూశాడు.
అప్పుడు ఒక నాగు పాము పడగ విప్పి.. శివుడి మీద చాలా సేపు అలానే నిలబడి ఉంది. దీంతో అతను తన ఫోన్ లలో ఈ ఘటనను రికార్డు చేశాడు. తనకునాగేంద్రుడి దర్శన భాగ్యం అయ్యిందని పొంగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భక్తిభావనలకు లోనౌతున్నారు.









