)
Cobra Snake turned into Young girl ai Video: పాముల వీడియోలు ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది నెటిజన్లు కోబ్రాల వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే ఎక్కడ ఎలాంటి పాములు కన్పించిన కూడా వెంటనే తమఫోన్ లలో రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కోబ్రాలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. వానాకాలంలో పాములు ఎక్కువగా బైటపడుతుంటాయి.
ముఖ్యంగా పాములు దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది ఈ ప్రదేశాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలో తరచుగా పాములు బైటకు వస్తుంటాయి.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పాము వీడియో బాగా వైరల్గా మారింది. దీనిలో అడవిలో ఒక వ్యక్తి నీళ్లలో దిగి స్నానం చేస్తున్నాడు.
ఇంతలో ఒడ్డున ఒక పాము పగడవిప్పీ మరీ అతడ్ని చూస్తుంది. ఇంతలో దాని మీద అతని ధ్యాస పడింది. ఆ పాము చూస్తుండగానే నాగినిగా మారిపోయింది. దీంతొ అతను షాక్ కు గురయ్యాడు. పాము ఇలా నాగినిలా మారిందని భయంతో నీళ్ల నుంచి బైటకు పరుగులు పెట్టాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
ఇది టెక్నాలజీతో తీసిన వీడియో అంటూ కొట్టిపారేస్తున్నారు. మరికొంత మంది ఈ విషయం తెలియని అమాయకులు ఇది నిజంగా ఒక పాము.. నాగినిలా మారిందా..?.. ఏంటని.. షాక్ కు గురై ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మొత్తంగా ఈ నాగు పాము వీడియో వైరల్గా మారింది.