King cobra Mating Video: నడిరోడ్డు మీద పాముల సయ్యాట.. ఇంతలో టవల్ పట్టుకుని వ్యక్తి షాకింగ్ పని.. ఓళ్లుగగుర్పొడిచే వీడియో..

Cobra Snakes video: రెండు పాములు సయ్యాటలాడుకుంటు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి టవల్ పట్టుకుని పాములపై కప్పడానికి ప్రయత్నించాడు.  దీంతో పాములు రెండు కూడా కోపంతో రగిలిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 22, 2025, 03:02 PM IST
  • రొోడ్డు మీద సయ్యాటాలాడుతున్న పాములు..
  • నెట్టింట వైరల్గా మారిన వీడియో..
King cobra Mating Video: నడిరోడ్డు మీద పాముల సయ్యాట.. ఇంతలో టవల్ పట్టుకుని వ్యక్తి షాకింగ్ పని.. ఓళ్లుగగుర్పొడిచే వీడియో..

snakes mating video viral:  పాములు ఎక్కువగా ఇటీవల జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎలుకలు ఉన్న చోట పాములు పక్కా.. ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు ఎండలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో పాములు.. భూమిలో విపరీతమైన వేడి వల్ల.. అవి మనుషుల ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. బూట్లలో, సజ్జల మీద, బట్టల కింద, బైక్ కవర్ లు, స్కూటీ డిక్కి మొదలైన ప్రదేశాల్లో పాములు నక్కి ఉంటున్నాయి.

Add Zee News as a Preferred Source

చాలా వరకు మనిషి అలజడి వస్తే.. అక్కడి నుంచి పాములు మరోచోటుకు వెళ్లిపోతాయి. పాములకు చెందిన వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలో ఉంటున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే భయంకరంగాను, మరికొన్ని ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంటారు.ఈ క్రమంలో పాముల సంభోగంకుచెందిన వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by My Memories (@melodies326)

ఈ నేపథ్యంలో రెండు పాములు రోడ్డుమీద రొమాన్స్ చేసుకుంటున్నాయి .దీంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడున్న వారంతా పాముల్ని చూసుకుంటూ నిలబడ్డారు. అందులో  కొంత మంది టవల్ పట్టుకుని రొమాన్స్ చేసుకుంటున్న పాముల దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత పాముల మీద ఒక్కసారిగా టవల్ ను విసిరేందుకు ప్రయత్నించాడు. 

 అక్కడున్న.. మరోవ్యక్తి అదేదో మనుషుల మీద టవల్ కప్పినట్లు సయ్యాట లాడుతున్న పాముల దగ్గరకు వెళ్లి మరీ పాముల మీద టవల్  కప్పాడు. దీంతో పాములు రెండు కోపంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అలా పాముల్ని డిస్టర్బ్ చేయోద్దని అంటున్నారు.

Read more: Tirumala Video: మరోసారి వివాదంలో తిరుమల.. కళ్యాణ కట్ట దగ్గర మహిళా ఉద్యోగి ఏంచేస్తుందో తెలుసా..? .. వీడియో వైరల్..  

అవి సయ్యాట లాడుతున్నప్పుడు చాలా కోపంగా ఉంటాయని.. పొరపాటున కాటు వేస్తే.. ప్రాణాలు గాల్లొకి కలిసిపోతాయని చెప్తున్నారు. పాముల్ని విడదీస్తే.. కాలసర్పదోషాలుచుట్టుకుంటుందని మరికొంరు అంటున్నారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News