)
Two-piece Cobra Video Viral Watch: అత్యంత విషపూరితమైన పాముల్లో నాగుపాములు ఒకటి. ఈ పాములు భారతదేశంతో పాటు అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నాగుపాములు వివిధ రంగుల్లో కూడా ఉంటాయి. ఇందులో మనం రెగ్యులర్‌గా చూసేవి గోధుమ రంగులో ఉంటాయి. అయితే కొన్ని పాములు నలుపు రంగులతో పాటు ఎరుపు రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయని మనం అప్పుడప్పుడు వైరల్ అయిన వీడియోల ద్వారా చూస్తూ ఉంటాం.. గత కొద్ది రోజుల నుంచి చాలా పాములు అడవులను వదిలిపెట్టి జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఇలా సంచారం చేసే క్రమంలో చాలా పాములు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది స్నేక్ క్యాచర్ వాటిని పట్టుకొని రక్షిస్తున్నారు.
చాలా పాములు ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. ఇలా గురైన పాములు రోడ్లపై, భవనాల దగ్గర తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాము చావు బతికల్లో కొట్టుమిచాడటం మీరు చూడొచ్చు.. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శిథిలావస్థ కింద చేరిన భవనం బేస్ కింద పాము రాళ్ల మధ్యలో ఇరుక్కుని ఉండడం మీరు చూడవచ్చు. అలాగే పాము తోక భాగం మొత్తం శిథిలాల కింద ఉండడం మీరు గమనించవచ్చు. అయితే అక్కడే ఉన్న స్థానికులు ఈ పామును తీసేందుకు ఎంతగానో ప్రయత్నించడం కూడా చూడొచ్చు.
ప్రమాదకరమైన పాము కావడంతో శిథిలాల కింద చిక్కుకొని ఉండడంతో కొంతమంది దానిని రక్షించేందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఒకతను ధైర్యం చేసి ఈ పామును కది పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను గోగా ఇస్ గ్రేట్ అని ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. కొంతమంది హర హర మహాదేవ్ అంటూ కామెంట్లు కూడా చేశారు. అంతేకాకుండా మరికొంతమంది బాధతో ఉన్న సింబల్స్ పెడుతూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను చూసిన వారంతా బాగోద్వేగానికి గురవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి