King Cobra Viral Video Watch Now: సాధారణంగా పాములు చాలా ప్రమాదకరం. ముఖ్యంగా నాగుపాముల గురించి అయితే చెప్పనక్కర్లేదు.. ఇవి ఏ జంతువుల పైన దాడి చేస్తే తప్పకుండా వాటిని ఆహారంగా మలుచుకునే వరకు పోరాడుతూనే ఉంటాయి. నాగుపాములు ఎప్పుడు మాంసంతో కూడిన ఆహారాలను మాత్రమే తినేందుకు ఆసక్తి చూపుతాయి. ముఖ్యంగా కొన్ని నాగుపాములయితే పక్షులను, క్రిమి కీటకాలను తింటే.. మరికొన్ని కోబ్రాలు పక్షుల గుడ్లు, చిన్నచిన్న ఎలుకలు, కుందేళ్లను తింటూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఆహారం తింటున్న ఓ పాముకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన జాతికి సంబంధించిన కింగ్ కోబ్రాలు కేవలం ఎలుకలను తినేందుకే ఇష్టపడతాయట. అందుకే అడవిలో చాలా పాములు ఎలుకలు ఎంత దూరం ఉన్నా వాటి దగ్గరికి వెళ్లి వేటాడి మరీ తింటాయట. ఇది ఆ పాములకున్న ప్రాముఖ్యత.. ముఖ్యంగా తెల్లజాతికి సంబంధించిన ఎలుకలు అంటే పాములు చచ్చేంత ఇష్టపడతాయి. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఓ భారీ కింగ్ కోబ్రా తను మింగిన ఎలుకలను ఒక్కటి ఒక్కటిగా బయటికి కక్కేస్తోంది. అయితే ఈ పాము పై ఒక కుక్క దాడి చేయడంతో ఇలా అది మింగిన ఎలుకలను బయటికి కక్కేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ వీడియోలో నాగుపాము కుక్కను కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. నోట్లో ఉన్న ఎలుకలు మొత్తం బయటికి కక్కిన తర్వాత తన వెంటే వస్తున్న కుక్కను దాడి చేసేందుకు ప్రయత్నించగా.. ఆ కుక్క ముందుగానే పసిగట్టి, ఆ పాముకి దూరంగా వెళ్లిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. సాధారణంగా వేటాడిన పాములు తమ ఆహారాన్ని తింటాయని.. కానీ ఈ వీడియోలో పాము ఎలుకలను ఒక్కొక్కటిగా బయటికి కట్టడం ఆశ్చర్యమేస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను సంజయ్ స్నేక్ సేవర్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోని వీక్షించారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









