)
Cobra Snake Wrapped Feeling Fan Video Viral: అప్పుడప్పుడు చాలా రోజులు ఇంట్లో లేనప్పుడు తిరిగి వచ్చిన సమయంలో కొన్ని ఊహించని ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో చెట్లు వాడిపోవడం, ఎలుకలు పిల్లలు పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఓ ఇంట్లో వీటన్నిటికీ విభిన్నంగా జరిగింది. చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన యజమానికి.. ఇంట్లో అడుగుపెట్టగానే నాగుపాము దర్శనమిచ్చింది. వారి ఇంట్లోకి అడుగుపెట్టగానే సీలింగ్ ఫ్యాన్‌పై ఓ నాగుపాము కనిపించింది. ఇది చూసి వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వామ్మో.. వామ్మో అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్ట సాగారు. ఇప్పుడు ఈ సీలింగ్ ఫ్యాన్‌పై చుట్టుకొని ఉన్న నాగుపాము కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివరాల్లోకి వెళ్తే..ఓ గ్రామంలోని కుటుంబ సభ్యులు అంతా కలిసి 15 రోజులపాటు విహారయాత్రలకు వెళ్లారు. వారు యాత్ర ముగించుకొని ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటికి వచ్చి డోర్స్ ఓపెన్ చేసి అందరూ ఇంటిని శుభ్రం చేశారు. అయితే ఇదే సమయంలో ఇంటిలోని ఒకరు ఫ్యాన్ వేద్దామని పైకి చూశారు. ఇంతలోనే వారికి ఆశ్చర్యం కలిగించే దృశ్యం కంట్లో పడింది. ఏకంగా ఫ్యాన్ పై నాగుపాము చుట్టుకుని ఉండడం చూసినవారు ఫ్యాన్ బటన్ నొక్కడం మానేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి ఇంట్లో వారంతా కలిసి బయటికి వెళ్లిపోయి స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు..
ఇక వెంటనే ఆ ఇంటి వద్దకు స్నేక్ క్యాచర్స్ కూడా చేరుకొని.. ఆ పామును రెస్క్యూ చేశారు. అయితే, ఇంట్లో ఎవరూ లేని సందర్భాల్లో చిన్నచిన్న రంధ్రాల గుండా పాములు ఇంట్లోకి ప్రవేశించి ఇలా ఎక్కడపడితే అక్కడ దర్శనం ఇస్తాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొన్ని రోజులపాటు ఇంట్లో లేని క్రమంలో తప్పకుండా వచ్చిన వెంటనే శుభ్రం చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఫ్యాన్లు, వాషింగ్ మిషన్స్‌ను దాదాపు శుభ్రం చేసే సమయంలో తప్పకుండా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. వీడియో చూసిన చాలామంది వామ్మో ఇంట్లో లేని సమయంలో పాములు ఇలా సంచారం చేస్తాయా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోను చూసి అటవీ పరిసరాల్లో జీవించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి