
couple falls to bengaluru auto driver feet video: సాధారణంగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కొన్ని సార్లు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు వాహనాల ఒకదానికి మరోకటి ఢీకొని ప్రమాదం జరుగుతుంటుంది. సిగ్నల్ దగ్గర బ్రేక్ లు ఫెయిల్ అయి లేదా కంట్రోల్ చేయడంతో ఆలస్యం అయితే ఇతర వాహానాల్ని వెనక నుంచి ఢీకొట్టడం వంటివి జరుగుతుంటాయ. కొన్నిసార్లు ప్రయాణికులు సైతం గాయపడిన ఘటనలు కొకొల్లలు.
A #Hindi-speaking woman slapped a #Kannadiga auto driver with a slipper in #Bengaluru.
According to auto driver's claim, "She was coming from the wrong side, but she started scolding & hitting me. Please check the nearby CCTV footage to see who is actually at fault!" he added. pic.twitter.com/bSRZV9Eg5W
— Safa ?? (@safaspeaks) May 31, 2025
ఈ క్రమంలో ప్రస్తుతం ఒక మహిళ తనను ఆటోవాలా కావాలని ఢీకొట్టాడని అతనితో వాగ్వాదంకు దిగింది. అంతే కాకుండా.. ఆటోవాలతో గొడవకు దిగి.. పబ్లిక్ గా అతడ్ని చెప్పుతొ కొట్టింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరుకు చెందిన మహిళ.. పాంఖురి మిశ్రా .. తన కాళ్ల మీద నుంచి ఆటోను కావాలని పొనిచ్చాడని అతడితో గొడవలకు దిగింది.
పాంఖురీ తన భర్తతో కలిసి టూ వీలర్‌పై వెళ్తుండగా.. ఆటో డ్రైవర్ లోకేశ్‌తో గొడవ జరిగింది. లోకేశ్ తన కాలి పైనుంచి ఆటో పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో డ్రైవర్ లోకేష్ వీడియో తీశాడు.
ఆ మహిళ వెంటనే అతడ్ని చెప్పుతో కొడుతు నా వీడియో తీస్తావా..?.. అంటూ మరింత రెచ్చిపోయింది. వీరి గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో సీసీటీవీలు పరిశీలించిన పోలీసులు ఆటోవాలా ఫిర్యాదు మేరకు.. మహిళను అరెస్ట్ చేశారు. నోటికొచ్చినట్లు తిట్టి, దాడి చేసినందుకు డ్రైవర్ ఆమెపై ఫిర్యాదు చేశారు.
పీఎస్ లో సదరు దంపతులు.. ఆటొవాలా కాళ్ల మీదపడి.. తను ప్రెగ్నెంట్ అని.. దయచేసి వదలేయాలని వేడుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో నెట్టింట మహిళను తిట్టిపోస్తున్నారు. ఆటొవాలను కొట్టినప్పుడు ప్రెగ్నెంట్ అని విషయం గుర్తుకు రాలేదా అంటూ ఏకీపారేస్తున్నారు. వుమెన్ సింపతీ కార్డు వాడుతున్నావా.. అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.