Couple photoshoot goes wrong in Bengaluru video: ఇటీవల కాలంలో చాలా మంది జంట వెడ్డింగ్ షూట్ లను తప్పకుండా పెట్టుకుంటున్నారు. పెళ్లి అనేది తమ జీవితంలో మర్చిపోకుండా ఉండేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. దీని కోసం ఎంత ఖర్చు అయిన కూడా వెనుకాడటంలేదు. పెళ్లి సెటిల్ అయినప్పటి నుంచి పెళ్లి తంతుపూర్తి అయ్యేవరకు... హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా ప్రతి ఒక్క వేడుకను వీడియోల రూపంలో ఉంచుకునేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు.
అయితే.. వెడ్డింగ్ షూట్ లను కొందరు సింపుల్గా చేసుకుంటే.. మరికొందరుస్పెషల్ ఎఫెక్ట్ ఉండాలని.. రిస్క్ లో పడే పనులు చేస్తున్నారు. కొంత మంది నదులు, ఎత్తైన కొండప్రదేశాలకు వెళ్లి ఫోటోషూట్ లలో పాల్గొంటున్నారు. తాజాగా.. కెనడాలో నివాసం ఉండే ఓ భారతీయ జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ ఇక్కడ పెళ్లికి ప్లాన్ లు చేశారు. అయితే.. వీరు వెడ్డింగ్ షూట్లను ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో ఓ కలర్ బాంబు పేల్చి ఆ కలర్స్ గాల్లో ఎగురుతూండగా.. పెళ్లి కూతుర్ని గాల్లోకి ఎగరేసి..ఫోటో, వీడియో తీయించుకోవాలనుకున్నారు. అదే విధంగా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడే వీరికి కలలో కూడా అనుకొని ఘటన ఎదురైంద. కలర్ బాంబు పేలి.. యువతి వెంట్రుకలకు మంటలు అంటుకున్నాయి. అంతేకాకుండా.. ఆమె శరీరంలో పలు ప్రదేశాల్లో తీవ్రగాయాలయ్యాయి. సరైన సమయంలో డాక్టర్ ల దగ్గరకు వెళ్లడంతొ ప్రాణాపాయం మాత్రం తప్పింది.
మొత్తంగా జంట మాత్రం.. పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారు. అయితే.. ఈ జంట తమకు కల్గిన అనుభవంను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తమలా మరేవ్వరు కూడా.. వెడ్డింగ్ ఫోటో షూట్ లో ఇలాంటి పనులు చేయోద్దని కూడా రిక్వెస్ట్ చేశారు. యువతి నడుము దగ్గర, వీపు భాగంగా పూర్తిగా కాలిన గాయాలున్నాయి. వెంట్రుకలు సైతం కాలిపోయాయి. యువతికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.