)
Couples Romance On Bike Video Watch: కొంతమంది ప్రేమికులు రోజురోజుకి మితిమీరిపోతున్నారు.. ఎక్కడ ఏ పనులు చేయాలో తెలీక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది జనసంద్రోహ ప్రదేశాల్లో కూడా రొమాన్స్ చేసుకుంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. మరి కొంతమంది మెట్రో రైల్లో ముద్దులు పెట్టుకుని దొరికిపోతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి.. తప్పు చేసామని వాపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రతినెల ప్రేమ జంటలకు సంబంధించిన ఒక్క వీడియో అయినా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఏముందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఓ హైవేపై కార్లు, లారీలు, బైకులు స్పీడుగా వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఓ ప్రేమ జంట కూడా బైక్‌పై ఓ మోతాదు స్పీడులో వెళ్తున్నారు. కానీ వీరు అందరిలాగా ప్రయాణం చేయడం లేదు. ఈ ప్రేమ జంట వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఒకరినొకరు హగ్ చేసుకుని.. బైక్‌పై వెళ్తున్నారు. అయితే ఈ దృశ్యాలను అటువైపుగా వెళుతున్న కొంతమంది మొబైల్లో చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు పగటిపూట రద్దీగా ఉండే హైవేపై బైక్ నడుపుకుంటూ వెళ్తూ ఉండడం మీరు చూడొచ్చు. అలాగే అతని వెనకాల సీట్లు ఒక యువతి కూడా కూర్చొని ఉండడం మీరు గమనించవచ్చు. వీరిద్దరూ ఎలాంటి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ముందుగా యువకుడు బైక్ స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో ఆ యువతి వైపుకు తల తిప్పాడు. ఇక ఆ యువతి కూడా అతని తల ముందుకు తీసుకువచ్చి మొద్దులు పెట్టడం మీరు గమనించవచ్చు. అయితే, ఈ ఘటనను కారులో వెళ్తున్న కొందరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
छतरपुर में चलती बाइक पर प्रेमी जोड़े ने की अश्लील हरकत...सरेआम रोमांस का वीडियो सोशल मीडिया पर हुआ वायरल#CHHATARPUR #MadhyaPradesh #LOVE pic.twitter.com/xaLS50Voxq
— Journalist Deepika singh (@Deepikasingh043) September 14, 2025
ప్రస్తుతం ఈ వీడియోను దీపికా సింగ్ అనే ఓ ప్రముఖ జర్నలిస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన చాలామంది ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే ఇలా రోడ్లపై అసభ్యకరమైన పనులు చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఈ వీడియో కామెంట్లు భాగంలో పోలీసులను కూడా ట్యాగ్ చేసి కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి