crocodile attacks on Elephant Shocking video: సాధారణంగా సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ముఖ్యంగా జంతువుల కంటెంట్ ఉన్న వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పాములు, ఏనుగులు, మొసళ్లు,చిరుత పులుల వీడియోలు ఇటీవల కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ క్రమంలో అడవులలో జంతువులు సరస్సులలో వెళ్లి నీళ్లను తాగుతుంటాయి. కొన్నిసార్లు జంతువుల ఒకవైపు నుంచి అడవిలో మరోకవైపుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సరస్సులను దాటాల్సి వస్తుంది. అప్పుడు సరస్సులలో జంతువుల కోసం రెడీగా మొసళ్లు కాచుకుని ఉంటాయి. నీళ్లుతాగేందుకు వచ్చిన లేదా అడవిలో ఒక చోటునుంచి మరోక చోటికి వెళ్లేందుకు ప్రయత్నించిన కూడా మొసళ్లు చాలా వరకు జంతువుల మీద దాడులు చేస్తుంటాయి.
నీళ్లలో ఉనప్పుడు మొసళ్లకు పదిఏనుగుల బలం ఉంటుందంటారు. అందుకే బలమైన ఏనుగులు, సింహలు సైతం.. మొసళ్లు నీళ్లలో ఉన్నప్పుడు వాటి జోలికి పోవు. కానీ కొన్నిసందర్భాలలో మొసళ్లకు ఈ జంతువులు నీళ్లలో ఉన్న కూడా చుక్కలు చూపిస్తుంటాయి. అయితే.. తాజాగా.. వైరల్ అవుతున్న వీడియోలో.. మొసలి నీళ్లలో ఉంది. సరస్సులో నీళ్లు తాగేందుకు ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. అప్పుడు మొసళ్లు ఒక్కసారిగా ఏనుగుల మీదకు దాడి చేసింది.
అందులో ఒక గున్న ఏనుగును పట్టుకుని మొసలి నీళ్లలోని లాగేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ గున్న ఏనుగు కూడా ఏమాత్రం భయపడకుండా.. మొసలికి చిక్కకుండా దానితో పోరాడింది. ఏనుగు తన తుండంను పట్టుకున్న మొసలిని బైటకు లాక్కొచ్చింది. ఆ తర్వాత అక్కడున్న ఏనుగులన్ని కూడా మొసలిపై ఎక్కి దానికి చుక్కలు చూపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.









