Crocodile Attacks Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. యువతిని గుటుక్కున మింగేసిన భారీ మొసలి..?.. షాకింగ్ వీడియో వైరల్..

crocodile attacks on woman: యువతి కొత్త ప్రదేశం దగ్గరకు వెళ్లి సెల్పీలకు ఫోజులిచ్చింది. ఆ ప్రదేశంలో అడవిలో సరస్సుకు దగ్గరలో ఉంది. ఇంతలో అనుకొని ఘటన చోటు చేసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 1, 2025, 01:27 PM IST
  • యువతిపై మొసలి దాడి..
  • అసలు విషయం తెలిసి నెటిజన్లు షాక్..
Crocodile Attacks Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. యువతిని గుటుక్కున మింగేసిన భారీ మొసలి..?.. షాకింగ్ వీడియో వైరల్..

Crocodile attacks on woman video: సాధారణంగా చాలా మంది ఏమాత్రం హలీడేలు దొరికిన కూడా తమ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కొత్త ప్రదేశాలకు వెళ్లిపోతుంటారు. కొంత మంది డెంజరస్ ప్రదేశాలకు కూడా వెళ్తుంటారు. అసలు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన కూడా చాలా మంది అస్సలు విన్పించు కోరు.  అంతేకాకుండా..  ఇటీవల సెల్ఫీల పిచ్చిలో తమ ప్రాణాలను సైతం డెంజర్ లో పడేసుకుంటున్నారు. సాధారణంగా అడవుల్లో సరస్సులో పెద్ద పెద్ద మొసళ్లు ఉంటాయి.

Add Zee News as a Preferred Source

కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా మంది ఈత కొడుతూ తమ ప్రాణాలు రిస్క్ లో పడేసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం.. అసలు నీళ్లు ఉన్న చోట వెళ్లేందుకు అస్సలు సాహాసం చేయరు. సరస్సులో మొసళ్లు దాక్కుని ఉంటాయి. పొరపాటున ఏవైన జంతువులు నీరు తాగానికి రాగానే అమాంతం దూకేసి.. జంతువులపై దాడులు చేస్తాయి. నీటిలో మొసలికి పది ఏనుగుల బలం ఉంటుందంటారు. అందుకే భారీ మొసళ్లను చూసి పెద్ద సింహలు, ఏనుగులు కూడా నీళ్లలోకి వెళ్లేందుకు డేర్ చేయవు.

 

అయితే.. ఇద్దరు యువతులు అడవికి సరదాగా వెళ్లారు అయితే.. సరస్సు ముందకు ఒక యువతి నిలబడి సెల్పీలకు ఫోజులిచ్చింది. మరోయువతి ఫోటోలు తీస్తుంది. ఇతంలో సరస్సులో నుంచి భారీ మొసలి చిటికెలో పైకి వచ్చి.. యువతిని గుటుక్కున మింగేసి నీళ్లలోకి వెళ్లిపోయింది. మరో యువతి చూస్తుండగా.. అదేదో.. బల్లి పురుగును మింగినట్లు ఈ మొసలిని యువతిని మింగేసింది. ఈ ఘటనతో షాకింగ్ కు గురైన యువతి కాపాడలంటూ భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది.

Read more: Lion Video Viral: ఏంగుండెరా వాడిదీ.. ఏకంగా సింహం తోకను పట్టుకుని మరీ.. షాకింగ్ వీడియో వైరల్..

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరు యువతులు కొత్త ప్రదేశాల్లోకి వెళ్తే పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోను క్రియేట్ చేసినట్లు సమాచారం. చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించకూడదని అవగాహాన చేస్తు..ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తొంది. మొత్తంగా ఈ వీడియోను చూసిన కొంత మంది నిజంగానే జరిగిందేమోనని భయంతో వణికిపోతున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News