Crocodile Fight With Leopard Viral Video Watch: అడవిలకు రారాజు సింహం అయితే నీటికి రారాజుగా మొసళ్ళను పిలుస్తూ ఉంటారు. ముసలి నీటిలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఏనుగును సైతం పడగొట్టే శక్తి సామర్థ్యాలు ముసలికి నీటిలో కలిగి ఉంటాయి. అందుకే నీటిలో పెద్ద పెద్ద జంతువులను సైతం సులభంగా దాడి చేసి ఆహారంగా మార్చుకుంటాయి. కానీ మొసలి నీటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి శక్తిని కలిగి ఉండదు. నీటిలో ఉన్నప్పుడే ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది.. బయటికి వస్తే సాధారణ సరీసృపాలు మారుతుంది. అయితే సోషల్ మీడియాలో మొసళ్ళకు సంబంధించిన అనేక రకాల వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మొసలి నీటి గుంట దగ్గర ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అయితే అక్కడికి అనుకోకుండా చిరుత పులి వస్తుంది వచ్చిన చిరుత పులి కొద్దిసేపు అటు ఇటు చూస్తుంది నీటి గుంట దగ్గర మొసలి ఉండడం గమనించి.. అక్కడికి వెళ్తుంది. అయితే మొసలి ప్రాణంతో ఉందని గ్రహించి చిరుత పులి దానిపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే మొసలి మెడను ముందుగా కొరికి.. నీటి నుంచి బయటికి లాగుతుంది. మొసలి ఈ సమయంలో చిరుత పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే చిరుత పులి చాలా బలంగా ఉండడంతో నీటిలో నుంచి పూర్తిగా మొసల్ని బయటికి లాగి ఎక్కడపడితే అక్కడ దాడి చేస్తుంది.
ఇలా దాడి చేసే క్రమంలోనే మొసలి చిరుత పులి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటు కదిలే ప్రయత్నం చేస్తుంది. ఎంత స్పీడుగా కదిలినప్పటికీ చిరుత పులి వదిలిపెట్టదు. చివరిగా చిరుత పులి ఆ మొసలిని ఒడ్డుకు లాక్కెళ్ళి.. దాడి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా చిరుత పులి ఎంతో బలం కలిగిందని చెప్పుకుంటున్నారు. సాధారణంగా మొసలి నీటిలో ఉంటే చిరుత పులి కంటే ఎక్కువగా శక్తిని కలిగి ఉండేది. ఒడ్డున ఉండడంతో చిరుత పులి తన బలాన్ని చూపించి దాడి చేసింది. ఈ దాడిలో చిరుత పులి విజయం సాధించింది.
ఈ చిరుత పులికి సంబంధించిన వీడియో ఇప్పుడు 'Zoabiologo' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఐదు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. కొంతమంది ఈ వీడియో చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుత పులి నీటిలో ఉన్న మొసల్ని వేటాడడం పెద్ద జోక్ అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు రాసుకున్నారు. మరి కొంతమంది అయితే చిరుత పులి నిజమైన వేటగాడని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి