big Crocodile in water video viral: చాలా మంది నదులు, చెరువులకు స్విమ్మింగ్ కోసం వెళ్తుంటారు. అయితే.. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటారు. నదిలో మొసళ్లు, పాములు, ఇతర జీవులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొత్త ప్రాంతాలలో అసలు.. చెరువు లేదా నదీ ఎంత లోతుందో ఎవరు కూడా చెప్పలేరు. దీంతో కొన్నిసార్లు లేనీపోనీ రిస్క్ లో కూడా పడే అవకాశం ఉందని చెబుతుంటారు.
కానీ కొంత మంది మాత్రం అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు. నీళ్లు కన్పించగానే... స్నానం చేసేందుకు, స్విమ్మింగ్ కోసం నీళ్లలోకి వెళ్తుంటారు.ఈ క్రమంలో కొన్నిసార్లుషాకింగ్ ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. తాజాగా.. ఒక వ్యక్తి నదిలో స్నానంకు వెళ్లి అతను రిస్క్ లో పడ్డాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి స్నానానికి నదిలోకి దిగాడు. అయితే.. అతని కాళ్ల దగ్గర ఏదో.. కదులుతున్నట్లు అన్పించింది. వెంటనే.. అతను ఏదో చేప అనుకున్నాడు.కానీ ఎందుకన్న మంచిదని.. మెల్లగా కాళ్లదగ్గర అసలు ఏముందని మెల్లగా నీళ్లలోకి చేతులు పెట్టి బైటకు తీశాడు.
పెద్ద చేప ఉండవచ్చని మొదట అనుకున్నాడు. కానీ అతను చెయ్యిపెట్టి బైటకు తీయగానే...పెద్ద మొసలి ఉంది. దీంతో వామ్మో.. అని భయంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే నీటిలో నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడున్న బోట్లోకి ఎక్కేశాడు. అప్పటికే పాపం.. మొసలి కూడా.. ఈ వ్యక్తి చేసిన పనికి షాక్ లో ఉండిపోయినట్లుంది. అతను ఏదో స్విమ్మింగ్ చేద్దామని వీడియో తన ఫ్రెండ్ తో రికార్డు చేయించుకున్నాడు.
Read more: Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..
కానీ ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం రికార్డు అయ్యింది.మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం వెంట్రుక వాసిలో బైటపడ్డావ్ కదా.. భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.








