Crow playing football with a boy video: సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు, రామచిలుకల్ని పెంచుకుంటారు. కొంత మంది ఇటీవల ఏనుగులు, పాముల్ని కూడా పెంచుకుంటున్నారు. అయితే.. కుక్కలు , పిల్లులు ఎంతో ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అవి తమ యజమాని చెప్పింది వింటాయి. అందుకే చాలా మంది కొన్నిపనుల్ని వాటితో చేయిస్తుంటారు.
న్యూస్ పేపర్ తీసుకొని రమ్మనడం, బాల్ లో ఆడుకొవడం వంటివి చేస్తుంటారు. అవి తమ ఓనర్ తో ఏంచక్కా ఆడుకుంటూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు మనం తరచుగా చూస్తుంటాం.మరోవైపు రామ చిలుకలు మాట్లాడతాయి. వీటికి ఇంట్లో వాళ్లు ఎలా మాట్లాడితే అదేవిధంగా రియాక్ట్ అవుతాయి. కొత్త ఇంటికి వస్తే అందర్ని అలర్ట్ చేస్తాయి.
In a rare video, a crow is seen playing #football with a child somewhere in South Goa pic.twitter.com/jVynpLGC0V
— The Goan ?? (@thegoanonline) May 20, 2025
ఇలాంటి వీడియోలు మనం గతంలో చూశాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక కాకి ఇంట్లో పిల్లాడితో ఫుట్ బాల్ ఆడుతుంది. అతను తన కాలితో కాకి వైపుకు బాల్ ను తన్నుతుంటే.. అది తన మూతితో బాల్ ను అతనివైపుకు నెట్టివేస్తుంది.
Read more: Viral Video: అరె వావ్.. హోటల్ లో చెఫ్ గా మారిన వానరం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అది బాలుడి కాలితో కొడుతూంటే.. నాకేం నేను ఆడతా అన్న విధంగా బాల్ ను తన మూతితో అటు ఇటు కదిలిస్తు బాల్ తో ఆడుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. కాకికి భలే ట్రైనింగ్ ఇచ్చారుగా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









