Crow Video: అరె వావ్.. అచ్చం మనిషిలా మాట్లాడుతున్న కాకి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Talking crow video: మూడేళ్ల క్రితం ఒక వ్యక్తికి వర్షంలో గూడు నుంచి కింద పడ్డ కాకి పిల్ల కన్పించింది. దీంతో అతను దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. అది అచ్చం మనుషుల్లా మాట్లాడుతూ అందరిని వాళ్లను ఆశ్చర్యపరుస్తుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 1, 2025, 05:12 PM IST
  • మాట్లాడుతున్న కాకి..
  • ఆశ్చర్యానికి గురౌతున్న నెటిజన్లు
Crow Video:  అరె వావ్.. అచ్చం మనిషిలా మాట్లాడుతున్న కాకి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Crow talking like humans video goes viral: సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకుంటారు. కొందరు రామచిలుకలు, మొదలైన పక్షులను పెంచుతుంటారు. సాధారణంగా రామచిలుకలు అచ్చం మనుషుల్ని ఇమిటేట్ చేస్తాయి. ఇంట్లో వాళ్లుఏది మాట్లాడితే అది మాట్లాడతాయి. అంతేకాకుండా.. కొత్త వాళ్లు వస్తే అలర్ట్ చేస్తాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలోని గర్గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Add Zee News as a Preferred Source

స్థానికంగా ఉండే.. ముకానే అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం ఒక కాకి దొరికింది.అతను అప్పటి నుంచి దాన్ని పెంచుకుంటున్నాడు. అయితే.. కాకీ మాత్రం కాస్తంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది.  అది అచ్చం మనుషుల్లా మాట్లాడుతుండటం అతను గమనించాడు.  ఇంట్లో వాళ్లు మాట్లాడే.. ‘‘అమ్మా, నాన్నా, దాదా, దాదీ,  మామ, మామి’’.. ఇలా వివిధ అనేక పదాలను పలుకుతుందని అక్కడి వాళ్లు  చెబుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో చెక్క బల్లపై నిలబడ్డ కాకి.. తన ‘‘కాకా.. కాకా’’.. అంటూ ఎవరినో పిలుస్తోంది. ఇలా చాలా సేపు ఆ కాకి.. అలా పిలుస్తూ ఎదురు చూస్తు నిలబడింది. ఈ  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాకి అచ్చం మనుషుల మాటలు ఇమిటెట్ చేస్తుందని తెలిసి అక్కడున్న వాళ్లు ప్రత్యేకంగా కాకిని చూసేందుకు డైలీ వస్తుంటారు. అయితే..చాలా మంది కాకి ఇంటి మీద వాలితేనే డౌటానుమానంగా ఉంటారు.

ఇంట్లోకి బంధువులు వస్తారని..ఏదోచెడు జరుగుతుందో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలాంటి క్రమంలొ ఇతను ఏకంగా కాకిని తన ఇంట్లోనే పెంచుతూ చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.  తమ ఇంటికి కాకి వచ్చాక ఇంకా మంచి జరిగిందని కూడా అతను చెప్పడం చూసి అక్కడున్న వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Read more:   Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. యువతిని గుటుక్కున మింగేసిన భారీ మొసలి..?.. షాకింగ్ వీడియో వైరల్..  

 

మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం విస్తుపోతున్నారు. మరికొందరు మాత్రం ఇదేక్కడి వింత బాబోయ్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కాకి  మాట్లాడటం మాత్రం వినడానికి కాదు కదా.. చూసేందుకు కూడా విడ్డూరంగా ఉందని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
 

 

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News