)
Cute Tiger Cubs Video Watch Now: సోషల్ మీడియాలో పులులు పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం సర్వ సాధారణం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సోషల్ మీడియాలో వదిలిన పులులకు సంబంధించిన దృశ్యాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. సాధారణంగా చిన్నచిన్న పులులు చాలా అరుదుగా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో తల్లిపులి స్నానం చేస్తున్న పిల్ల పులులకు కాపలాగా నిలిచింది. దీనికి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నంద తన ఎగ్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన పులులకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్న కొలనులో కొన్ని పులి పిల్లలు స్నానం చేస్తున్న దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఇక వీడియో వివరాల్లోకి వెళితే.. వీడియో ప్రారంభంలోనే చిన్న కొలనులో మూడు పులి పిల్లలు హాయిగా నీటిలో మునిగి స్నానం చేస్తుండడం మీరు గమనించవచ్చు. ఇలా ఆ పిల్లలు పొలంలో ఎంతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు..
అయితే, వీడియోలు పిల్లలతో పాటు తల్లి కూడా కొలను ఒడ్డుపై కాపలా కాస్తూ ఉండడం చూడొచ్చు. పిల్లలకి ఏ జంతువులైన హాని కలిగిస్తే అప్రమత్తమై వాటిపై దాడి చేసేందుకు తల్లి పులి రెడీగా ఉండడం ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు. అలాగే ఆ కొలను చుట్టు ఆడ పులి అటు ఇటు చూడడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఆ ఆడ పులి నెమ్మదిగా పిల్లలు ఉన్న వద్దకు చేరుకొని కొద్దికొద్దిగా నీటిని తాగడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్ గా మారాయి..
ఫారెస్ట్ అధికారి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ గా కొన్ని అంశాలు రాసుకు వచ్చారు. తల్లి ఎప్పుడూ నిద్రపోదని.. పిల్లలను ఆడుకుంటున్న సమయంలో ఇతర జంతువుల నుంచి కాపాడేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని.. తెలిపారు. అలాగే పులులు నీటిలో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతాయని.. వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి తప్పకుండా పులులు నీటిలో రోజుకొకసారైనా దిగి ఆనందంగా ఆడుకుంటాయని IFS అధికారి తెలిపారు.
A mother’s eye never rest-the tigress guards the cub as they play cooling their body in a waterhole?
Tigers are rare among big cats.They love water. It regulates their body temperature,relieves parasites,biting insects & helps them to conserve energy.
Natures Air Conditioners. pic.twitter.com/6PzkvixAiv— Susanta Nanda IFS (Retd) (@susantananda3) August 17, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook