Cuckoo Vs Cobra Viral Video Watch: సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ప్రకృతిలో వింతలు విశేషాలు నిత్యం మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.. రీల్స్‌తో పాటు యూట్యూబ్ షార్ట్ వీడియోలో అద్భుతమైన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజు ప్రకృతికి సంబంధించిన వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ కోకిల పక్షితో పాటు అత్యంత విషపూరితమైన నాగుపాము కు సంబంధించిన వీడియో ప్రత్యక్షమైంది. వీటి రెండిటి మధ్య భీకర ఘర్షణ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పక్షులు చిన్న చిన్న క్రిమి కీటకాలను తిని బతుకుతూ ఉంటాయి. అలాంటిది ఓ కోకిల పక్షి అత్యంత విషపూరితమైన నాగుపామును వేటాడుతూ కనిపించింది. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోకిల పక్షులు అత్యంత విషపూరితమైన పాములకు భద్ర శత్రువులని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కోకిలలు పాములు దాడి చేసినప్పటికీ బ్రతికే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. అలాంటి కోకిలే ఈరోజు అత్యంత విషపూరితమైన పామును వేటాడటం ఈ వీడియోలో చూడొచ్చు. కోకిల తన పదునైన పంజాతో కత్తిలాంటి ముక్కుతో అత్యంత విషపూరితమైన నాగుపాము పైనే దాడి చేయడం మీరు చూడొచ్చు.
ఈ వీడియోలో పక్షి తన ముక్కుతో వేగంగా పామును కొడుతూ దానిని సులభంగా నియంత్రించింది. అలాగే కోకిల సామర్ధ్యాన్ని తెలుసుకున్న పాము దానిపై ఏమాత్రం దాడి చేసేందుకు ప్రయత్నించలేదు. చివరికి కోకిల ఆ పాము పడగ భాగంలో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచేసింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.. ఈ వీడియో చూసిన వారంతా ప్రకృతి ఆహారపు గొలుసులో పాత్రేనని చెబుతున్నారు. మరి కొంతమంది అయితే ఈ వీడియో చూసి ఆశ్చర్యానికి గురవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. కానీ ఇది ఇప్పుడు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









