Cute Baby Girl Funny Video Goes Viral: సాధారణంగా చిన్న పిల్లలు ఏంచేసిన కూడా నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. ముఖ్యంగా ఆడ పిల్లలు ఉంటే ఇంతో ఎంతో సందడిగా ఉంటుంది. బైట ఎన్ని టెన్షన్ లు ఉన్నా.. ఎన్ని గొడవలు ఉన్నా.. కూడా ఇంట్లో వచ్చి చిన్న పిల్లల్ని.. వాళ్లు చేసే అల్లరి చూస్తే అవన్ని మర్చిపోతుంటాం. అందుకు ఇంట్లో పిల్లలు ఉంటే..ఆ సందడి, ఆ కళ వేరు అంటారు.
ఇదిలా ఉండగా.. చిన్న పిల్లలు కొన్ని సార్లు మొండిగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ల పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంది. చిన్నారులు మొత్తంగా వాళ్లు కొన్నిసార్లు వెరైటీగా కూడా ప్రవర్తిస్తారు. ఏదీ వద్దంటే.. అదే పనులు చేస్తారు. మొత్తంగా చిన్న పిల్లల ఫన్నీ వీడియోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే.. చిన్న పిల్లల్ని చూసుకొవడం ఒక పెద్ద టాస్క్ గా చెప్పుకొవచ్చు. ఒక చోట వదిలి పెడితే అక్కడ అస్సలు ఉండరు.
Childhood Video of Many "Andhra Girls" pic.twitter.com/J6xqtrEAsN
— Addicted To Memes (@Addictedtomemez) April 23, 2025
పాక్కుంటూ... ఏటో వెళ్లిపోతుంటారు. ఇటు చూసి అటు చూసే వరకు ఉండరు. ఇలా ఇంట్లో వాళ్లను ముప్పు తిప్పలు పెడుతుంటారు. ప్రస్తుతం ఒక చిన్నారి తన తల్లికి చుక్కలు చూపించింది. బుడ్డది ఇంత లేదు కానీ.. తల్లి ఏంచెప్పిన వినట్లేదు. ఈ వీడియోలో.. చిన్నారి.. చింత చిగురుతో ఆటలాడుకుంటుంది. ఆమె ముందు గిన్నెలలో చింత చిగురు ఉంది. అయితే.. ఆమె తల్లి ఇలా చేతులు పెట్టుకుని ఆడుకొవద్దని చిన్నారి చేతులు తీసేస్తుంది.
Read more; Cobra Snake Facts: పాములు కుబుసం విడవడం, మరో పాముతో జతకట్టడం గురించి ఈ రహాస్యాలు మీకు తెలుసా..?
కానీ బుడ్డది మాత్రం.. మళ్లీ .. మళ్లీ చింత చిగురును తన చేతిలో తీసుకుని ఆడుకుంటుంది. మొత్తంగా చిన్నారి మాత్రం.. తన తల్లికే ఈ వయసులోనే అస్సలువినట్లేదు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.బుడ్డది ఇప్పుడే వింటలేదు.. పెద్దాయ్యాక.. ఏంటో అనిఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









