Dog Dancing Video: ఓరేయ్‌ ఇదేం కుక్కరా? ఇలా డ్యాన్స్‌ చేస్తోంది.. వీడియో చూస్తారా?

Very Rare Dog Dancing Video: ప్రస్తుతం సోషల్ మీడియాకు డ్యాన్స్ చేస్తున్న కుక్కకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కుక్క చేస్తున్న డాన్స్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో కుక్క ఎలా డాన్స్ చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2025, 09:15 AM IST
Dog Dancing Video: ఓరేయ్‌ ఇదేం కుక్కరా? ఇలా డ్యాన్స్‌ చేస్తోంది.. వీడియో చూస్తారా?

Very Rare Dog Dancing Video:కుక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరూ ఎంతో ఇష్టంగా వాటిని పెంచుకుంటూ ఉంటారు. కుక్కలు మనుషులపై చూపే విశ్వాసం అంతో ఇంతో కాదు.. మనుషులకు ఎలాంటి సమస్యలు వచ్చినా అవి ఏమాత్రం వెనకాడకుండా పరిష్కార మార్గానికి ఎంతో కొంత అయినా సహాయపడతాయి. ఇందులో భాగంగానే చాలామంది కుక్కలను కొంటూ ఉంటున్నారు. అయితే ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాలో వారు పెంచుకుంటున్న కుక్కలకు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ చేసిన వీడియోలే సోషల్ మీడియాను ఏలుతున్నాయి. షేర్ చేసిన నిమిషాల వ్యవధిలో ఉండే కోట్లలో వ్యూస్ దాటిపోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది వారు పెంచుకుంటున్న కుక్కల జీవన విధానాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాని వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలతో పాటు పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటున్నాయి. చాలామంది కుక్కలకు సంబంధించిన వీడియోలను చేసేందుకు ఎంతో ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ కుక్కకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కుక్క వైట్ సౌండ్ మ్యూజిక్ డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ కుక్క ఎంతో హ్యాపీగా బైక్ సౌండ్ మ్యూజిక్ కి స్టెప్పులు వేయడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఇలా కొన్ని సెకన్ల పాటు డాన్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కొన్ని కుక్కలు చాలా అరుదుగా మనుషులు చేసే పనులను చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ చిన్న కుక్క పిల్ల బైక్ సౌండ్ మ్యూజిక్ కి డాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ కుక్క డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. ఈ వీడియోను @serenovive అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియోని చూసిన చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.. ఈ వీడియోలో ఉన్న కుక్క నిజమైంది కాదని.. ఇది ఒక AI సృష్టించిన వీడియో అని కామెంట్లలో తెలుపుతున్నారు. నిజానికి వీడియోలో గమనించి చూస్తే.. ఈ వీడియో నిజమైంది కాదని మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ వీడియో ను కొన్ని వేలమందికి పైగా నేటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అలాగే 6 లక్షల మందికి పైగా ఈ వీడియోని లైక్ చేసారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News