Viral Baby and Daddy Feeding Video: తండ్రి, కొడుకుల అనుబంధం అనేది ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన, బలమైన సంబంధాలలో ఒకటి. ఇది ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో కూడిన లోతైన బంధం. అయితే ఈ బంధంకు సంబంధించి ఎల్లప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం అనేది చాలా సాధారణ విషయం. ముఖ్యంగా చిన్న పిల్లల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి.
పిల్లలు సహజంగానే చాలా ముద్దుగా ఉంటారు. వారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, చేష్టలు అందరినీ ఆకర్షిస్తాయి. పిల్లల అమాయకపు పనులు, మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి. స్ట్రెస్ ఫుల్ లైఫ్ లో కాస్త నవ్వుకోడానికి ఇలాంటి వీడియోలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని ఎంతో క్యూట్‌గా ఉంటే మరి కొన్ని కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. అలాంటి దే ఓ వీడియో ప్రస్తుతం తెగ్ వైరల్ అవుతుంది. @fatin_offical10 అనే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ బుజ్జి బాబు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తండ్రి, కొడుకు పక్క పక్కన ఉంటారు. వాళ్ళ నాన్నకు అమ్మ అన్నం తినిపిస్తూంటే.. ఆయన వద్దని మారం చేస్తున్నట్లు కనిపిస్తుంది. నాన్నను చూస్తూ బాబు నవ్వుతుంటాడు. కానీ వెంటనే వాళ్ళ అమ్మ ఒక చెంప దెబ్బ కొట్టి తినపించడం చూసిన బాబు ఒక్కసారిగా ఉలికిపడుతాడు. వెంటనే వాళ్ళ పెట్టిన అన్నం ముద్ద తింటాడు. ఈ స్కీన్ చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతున్న ఎమోజీలును కామెంట్స్ చేశారు. మరికొందరూ పిల్లల ముందు నాన్నలు ఎప్పుడు బలి అవుతుంటారు అని సరదాగా కామెంట్ చేశారు.
పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ముఖ్యంగా పెద్దల ప్రవర్తనను పరిశీలిస్తూనే నేర్చుకుంటారు అని చెప్పడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందుకే పిల్లల ముందు పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. వారు మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, చేసే పనులు అన్నీ పిల్లలపై ప్రభావం చూపుతాయి. పిల్లల ఎదుగుదలలో పెద్దల పాత్ర చాలా కీలకం. పెద్దలు తమ ప్రవర్తన ద్వారా పిల్లలకు మంచి మార్గదర్శకులుగా ఉండాలి.
Also Read: Slate Pencil Eating Challenge: బలపాల ప్రియులకు స్పెషల్ వీడియో.. చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









