)
Nagamani Stone Video Watch Here: నాగమణి గురించి పురాతన కాలం నుంచి వస్తున్న ఎన్నో కథలు ఇప్పటికీ సమాజంలో ప్రచారంలోనే ఉన్నాయి. గతంలో చాలా వీడియోలు నాగుపాము తల నుంచి సేకరించే నాగమణి పాము కాటుకు గురైన వారి శరీరంలో నుంచి విషాన్ని లాగేస్తుందని.. పాములను దగ్గరికి రాకుండా ఉంచుతుందని, అలాగే ఈ నాగమణిని పాముల తలభాగం నుంచి తీస్తారని ప్రచారంలో ఉన్న అనేక అపోహల వెనక ఉన్న నిజాలకు సంబంధించిన ఒక కొత్త అధ్యయనం ఇప్పుడు తెరపైకి వచ్చింది.. గతంలో నాగమణిని సేకరిస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇవన్నీ అవాస్తవాలు అంటే మీరు నమ్ముతారా? నిపుణులు ఏమంటున్నారంటే..
యూట్యూబ్‌లో వైరల్ అయిన కొన్ని వీడియోల్లో నాగమణి అనేది అత్యంత అరుదైనదని.. ఇవి కొన్ని పాములు తలభాగం నుంచి తీస్తారని.. దీనికి అత్యంత అరుదైన శక్తులు కలిగి ఉంటాయని.. నాగమణిని పాము కాటేసినచోట ఉంచితే విషం లాగేస్తుందని.. ఎన్నో అవాస్తవాలు ప్రచారం అయ్యాయి.. అయితే, ఈ అపోహాల కారణంగానే కొంతమంది అమాయకపు ప్రజలు మోసపోతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.. నిజానికి ఈ నాగమణి రత్నం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని.. ఇలా జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని.. పాములు కాటేసిన చోట ఉంచడం వల్ల ఎలాంటి విషయం పీల్చుకోదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ అపోహల వల్ల కొంతమంది కొన్నిసార్లు ప్రాణాంతక పరిస్థితులకు కూడా గురవుతున్నారని వారంటున్నారు.
నాగమణికి నిజంగానే అరుదైన శక్తులు ఉంటాయా?
కొంతమంది నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా నాగమణికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభ్యం కాలేవని వారు స్పష్టం చేశారు. పాముల తలభాగాల్లో నాగమణి అసలు ఉండనే ఉండదని వారు తెలిపారు. ఇవి కేవలం కల్పిత కథల్లో మాత్రమే సాధ్యమవుతుందని నిపుణులు వివరించారు.. కొంతమంది కావాలని ప్రజలను మోసగించి డబ్బులను సంపాదించేందుకు ఇలా అవస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు..
ముఖ్యంగా కొంతమంది పాములు పట్టే వారైతే.. పల్లె ప్రాంతాల్లో తిరిగి.. ఒకచోట పామును ఉంచి దాని తలభాగాన్ని కట్ చేసి అందులో నుంచి నాగమణి రత్నాలను బయటికి తీయడం, ప్రజల్లో అవాస్తవాలను నింపడం చేస్తున్నారు. నిజానికి వారు చెబుతుంది పచ్చి అబద్దాలని నిపుణులు తెలుపుతున్నారు. అమాయకపు ప్రజల నుంచి డబ్బులను సంపాదించుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నారని వారంటున్నారు. కాబట్టి పల్లె ప్రాంతాల్లో ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలాగే మభ్యపెడితే.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా స్నేక్ సొసైటీ నిపుణులు తెలుపుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి