Viral Video: కన్న తల్లిని చావబాదుతూ కూతురు చిత్రహింసలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

Daughter torture mother in haryana: కూతురు తన తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించింది. ఈ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 28, 2025, 06:21 PM IST
  • కన్న తల్లిపై పైశాచీక దాడి..
  • రక్తం ఉడికిపోతుందంటు నెటిజన్ల పోస్టులు..
Viral Video: కన్న తల్లిని చావబాదుతూ కూతురు చిత్రహింసలు..  కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

Daughter tortures mother in haryana video: చాలా మంది కన్న తల్లిదండ్రుల్ని దైవంగా భావిస్తారు. తమ పిల్లల కోసం నవమాసాలు మోసీ, కని పెంచి ఆ తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన బిడ్డల కోసం ప్రతి సెకన్ ఆలోచిస్తుంటుంది. తమ పిల్నల్ని అస్సలు వదిలి పెట్టదు. అంతేకాకుండా.. తమ బిడ్డ మోహంలో సంతోషం కోసం ఏమైన చేసేందుకు రెడీగా ఉంటుంది. అందుకే చాలా మంది కన్న తల్లిదండ్రుల్ని దైవంలా భావిస్తారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో కన్న వాళ్లను చాలా మంది ప్రేమతో చూసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కన్న వాళ్లను టార్చర్ పెడుతుంటారు. చిన్నప్పుడు వాళ్లను ఎంత అల్లారుముద్దుగాచూసుకున్నారో.. అంతకన్న ఘోరంగా చిత్ర హింసలు పెడుతారు. తమ వాళ్లను అనాథశ్రమంలో వదిలేస్తారు. మరికొందరు తమ వాళ్లను ఇంట్లో పెట్టి చిత్రహింసలు గురిచేస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

హర్యానాలో ఒక కూతురు తన తల్లిని టార్చర్ చేసింది. ఆమెను బెడ్ మీద కూర్చొబెట్టి.. ఆమెను కొడుతూ, రక్కుతూ, నోటితో ప్రైవేటు  భాగాన్ని కొరుకుతూ దారుణంగా ప్రవర్తించింది. తల్లి ఏడుస్తున్న ఏమాత్రం కనికరించకుండా.. నీచంగా ప్రవర్తించింది. పాపం.. కన్న తల్లి కూతురు కొడుతున్న దెబ్బలకు తాళలేక ఏడుస్తుంటే పైశాచీక ఆనందం పొందింది. ఈ వీడియోను ఇంటి పక్కన ఉన్న వారు సీక్రెట్ గా రికార్డు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం.  

Read more: Viral Video: హల్దీ వేడుకల్లో కోతి హల్ చల్.. ఏకంగా వధువు దగ్గరకు వెళ్లి మరీ ఆ పని.. వీడియో వైరల్..

దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు . ఇప్పటి వరకు కొడుకులు టార్చర్ పెడుతుంటారని మనం చూశాం. కానీ ఇక్కడ మాత్రం.. కూతురు అరుదుగా తల్లిని టార్చర్ చేస్తున్న వీడియో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తమ రక్తం ఉడికిపోతుందని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని హర్యానా సీఎం, డీజీపీ, కమిషనర్ లకు ఈ వీడియోను నెటిజన్లు ట్యాగ్ చేసి కఠిన చర్యలు తీసుకొవాలని పోస్ట్ లు పెడుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News