)
Dead Snake Bite: పాము అంటేనే మనలో చాలా మందికి చచ్చేంత భయం. పాము బతికి ఉన్నా.. చనిపోయినా.. దాని దరిదాపుల్లోకి వెళ్లేందుకు ఎవరు సాహసం చేయరు. అలాంటి పాము చనిపోయిన తర్వాత కూడా కాటు వేసి మనిషిని చంపే కెపాసిటీ ఉందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే, పాము చనిపోయినా అది కాటు వేసే సామర్థ్యం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా సాధ్యం?
పాము చనిపోయినా అందులోని కండరాలు కొంత సమయం వరకు పనిచేస్తూనే ఉంటాయి. అలా పాముపై దాడి చేస్తే దానంతట అదే ప్రతిచర్యగా కాటు వేస్తుంది. పాము తల తెగినా.. దాని నాడీ వ్యవస్థలోని కండరాలు ప్రతిస్పందిస్తాయట. దీనివల్ల పాము నోరు తెరిచి కాటు వేసే అవకాశం తప్పకుండా ఉంది. మరీ ముఖ్యంగా పాము తలపై ఎలాంటి హాని జరగకపోతే అది మరింత తీవ్రంగా దాడి చేసే అవకాశం ఉంది. అందుకే మనలో చాలా మంది పామును చంపేముందు ముఖ్యంగా దాని తలపై దాడి చేస్తారు. పాము ఏ పరిస్థితిలో ఉన్నా.. దాని కోరల నుంచి విషం విడుదలయ్యే అవకాశం ఉంది.
బతికి ఉన్న పాము లాగే..
ఒకవేళ పాము చనిపోయినా.. అది బతికే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాంటి చనిపోయిన పాములు కూడా కాటు వేస్తే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే కోరల్లోని విషగ్రంథులు అలాగే ఉంటాయట. అవి చనిపోయినా విషాన్ని విడుదల చేసే గుణాన్ని పాము కోల్పోదట. అలా చనిపోయిన పాము కోరలు కూడా విషం మనిషి శరీరంలోకి పంపి చంపేందుకు అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం మేలు.
సాక్ష్యం ఇదే!!
చనిపోయిన పాము కూడా కాటు వేస్తుందనే దానికి ఇటీవలే అస్సాంలో జరిగిన ఓ సంఘటన నిదర్శనం. అస్సాంలోని ఇద్దరు వ్యక్తులు చనిపోయిన త్రాచుపామును పట్టుకొని దాని కాటుకు గురయ్యారు. అయితే వారు వెంటనే వైద్య చికిత్స తీసుకోవడంతో బతికి బయటపడ్డారు. పాము చనిపోయిన తర్వాత కూడా దాని కండరాలు యాక్టివ్ ఉంటాయనే దానికి ఉదాహరణ ఇదే. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పాము బతికున్నా, చనిపోయినా వాటితో జాగ్రత్తగా వ్యవహరించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook