Deer attacks on girl while taking selfie video: ఇటీవల కాలంలో యువత సెల్ఫీల పిచ్చిలో డెంజరస్ పనులు చేస్తున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్లగానే సెల్ఫీలు దిగుతూ లేని పోనీ రచ్చచేస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీల పిచ్చిలో అసలుఏంచేస్తున్నారో..ఎక్కడ ఉంటున్నారో కూడా మర్చిపోతున్నారు. చాలా మంది కొండ ప్రాంతాలు, వాటర్ ఫాల్స్ , క్రూరమైన జంతువుల దగ్గరకు వెళ్లి కూడా డెంజరస్ స్టంట్లు చేస్తున్నారు.ఈ సెల్ఫీల వల్ల చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
అడవిలో క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగి కొంత మంది వాటి దాడిబారిన పడ్డారు.అంతే కాకుండా.. సెల్ఫీల మాయలో పడి యువత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక యువతి అడవికి వెళ్లింది. అక్కడ ఆమెకు జింక కన్పించింది. వెంటనే తన జింకతో సెల్ఫీ కోసం ప్రయత్నించింది.
ఈ క్రమంలో వెంటనే ఆ జింక తొలుత నార్మల్ గా ఉన్న కూడా మళ్లీ ఒక్కసారిగా ఆమెపైన దాడికి తెగ బడింది. ఆమె మీదకు వచ్చి.. ఒక్కసారిగా కుమ్మడానికి ప్రయత్నించింది. దీంతో యువతి భయపడి ఒక్కసారిగా అక్కడి పరుగులు పెట్టింది. రెప్పపాటులో యువతి డెంజర్ నుంచి జెస్ట్ లో తప్పించుకుంది. అయితే.. ఆమె రీల్స్ కోసం ప్రయత్నించిన ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.మరీ ఇలాంటివి మానుకొవాలని కూడా సెటైర్ లు వేస్తున్నారు.
కొంత మంది బస్టాండ్ లు, మెట్రోలు, విమానంలో, బైక్ ల మీద డెంజరస్ గా సెల్ఫీలు దిగుతున్నారు.కొన్నిసార్లు ఈ ఫోటోలు,వీడియోలు, రీల్స్ ల పిచ్చిలో పడి వారి ప్రాణాలు డెంజర్ లో పడేసుకొవడమేకాకుండా.. ఇతరుల ప్రాణాలను సైతం డెంజర్లో పడేస్తున్నారు. దీంతో ఇటీవల చాలా మంది సోషల్ మీడియా వేదికగా సెల్ఫీల మీద అవగాహన కల్పిస్తు పలు వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికైన యువతీ, యువకులు తమ ధోరణిని మార్చుకొవాలని కూడా సోషల్ మీడియా వేదికగా జనాలు సెల్ఫీల మీద తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు.









