Diamonds Search Video: నల్లమల వాగులో కోట్ల విలువ చేసే వజ్రాలు.. ఎగబడి వెతుకుతున్న కూలీలు..వీడియో..

Diamonds Searching In Nallama Video Watch: మహానందికి సమీపంలో ఉన్న నల్లమల అడవి ప్రాంతంలోని ఓ గ్రామం గుండా ప్రవేశించే రాళ్లవాగు ఇప్పుడు వజ్రాల వేటకు అడ్డాగా మారింది. అక్కడికి కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వజ్రాలను వెతకడం ప్రారంభిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికిన కోటీశ్వరులు అయిపోదామని రాత్రి పగలు తేడా లేకుండా వజ్రాలు వెతుకుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 9, 2025, 05:05 PM IST
Diamonds Search Video: నల్లమల వాగులో కోట్ల విలువ చేసే వజ్రాలు.. ఎగబడి వెతుకుతున్న కూలీలు..వీడియో..

Diamonds Searching In Nallama Video Watch Here: అడవి ప్రాంతాల్లో ఏదో ఒక వాగు పారుతూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్క అడవి దగ్గర ఒక్కొక్క భాగం తప్పకుండా పారుతూ ఉంటుంది.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అడవుల గుండా కొన్ని వాగులు పాడుతూ ఉంటాయి. అందులో భాగంగా నల్లమల అడవిలో నుంచి పారే రాళ్లవాకకు ఇప్పుడు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ వాకి ఇప్పుడు వజ్రాల వాగుగా ప్రచారం జరుగుతోంది.. ఈ వాగులో వజ్రాలు దొరుకుతున్నాయో లేదో కానీ.. పేదవారి నుంచి కూలీల వరకు అందరూ ఇక్కడికి వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వాగులోనే వజ్రాల కోసం శోధిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహానంది మండలానికి సమీపంగా ఉన్న గాజుల పల్లె గ్రామం నల్లమల అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ అడవిలోనే ప్రాచీనంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంటుంది. అయితే, ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది.. పూర్వం స్వామివారి కల్యాణంలో భాగంగా అమ్మవారికి ఇదే వాగులో నుంచి తీసిన వజ్రాలను తలంబ్రాలుగా పోసే వారిని కథ ప్రచారంలో ఉంది. దీంతో ఇప్పటికీ ప్రజలు ఇదే నమ్మి.. వజ్రాల వేట కోసం వాగులు రాత్రి పగలు తేడా లేకుండా వెతుకుతున్నారు. ఆ గ్రామానికి చెందిన చాలామంది ఇక్కడ వజ్రాలు లభించాయని ఇతర గ్రామస్తులకు చెప్పడంతో.. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా ఇక్కడికి చేరుకొని వజ్రాల వేట ప్రారంభించారు. ఇప్పటివరకు ఎవరికి వజ్రాలు దొరకకపోయినా.. గత కొద్ది రోజుల నుంచి కూలీలు మాత్రం విపరీతంగా శోధిస్తున్నారు. 

ఇప్పటికే ఈ వాగుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు ఈ రాళ్ల వాగును వజ్రాల వాగు పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఈ వాగు గాజులపల్లి రైల్వే స్టేషన్‌తకి చాలా దగ్గరగా ఉండడం.. మహిళలకు ప్రభుత్వం ఫ్రీ బస్సు అందించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడికి చేరుకొని వజ్రాలను వెతకడం ప్రారంభిస్తున్నారు. ఈ ఊరికి సమీపంలో ఉన్న వారే కాకుండా.. వజ్రాల వేట కోసం విజయవాడ, ప్రకాశం ఇతర జిల్లాల నుంచి కూడా కూలీలు రైల్వే మార్గం గుండా వచ్చి.. ఈ వజ్రాల వాగులో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Also Read: Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

కొంతమంది కూలీలు అయితే.. పెద్ద పెద్ద బండరాలను సైతం అటు ఇటు జరిపేందుకు వచ్చే సమయంలోనే పెద్ద పెద్ద జల్లెడలతో పాటు గడ్డపారాలు, వజ్రాలను వెలిక్కి తీసే పరికరాలను వెంట తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఏదైనా ఒకటి వజ్రం లాంటి ఆకారంతో కూడిన రాళ్లు దొరికితే.. దాన్ని అక్కడే వజ్రాల పరికరాలతో పరీక్షిస్తున్నారు. గతంలో ఈ వజ్రాల వాగు దగ్గర ఒక్కరాయిని పరీక్షించేందుకు కేవలం వజ్రాలను పరీక్షించేవారు పది రూపాయలు మాత్రమే తీసుకునేవారు.. ఇప్పుడు ఇది డబ్బులు అయింది.. ఒక్కొక్క రాయిని పరీక్షించేందుకు ఇప్పుడు దాదాపు 30 రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఊరిలో హోటల్స్‌తో పాటు కూల్ డ్రింక్ షాపులకు కూడా గిరాకీ బాగా పెరిగింది. అలిసిపోయిన కూలీలు అక్కడే ఉన్న హోటల్స్ లో బసచేయడం, కూల్ డ్రింక్స్ కొనుక్కొని తాగడం వంటివి చేస్తున్నారు.

Also Read: Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News