Viral Video: బాప్ రే.. బాలుడి ముక్కులో జలగ.. షాకింగ్‌కు గురైన డాక్టర్లు.. వీడియో వైరల్..

Worm from boy nose in Kashmir: బాలుడి ముక్కులో నుంచి ఏదో జలగ లాంటిది కన్పించడంతో వెంటనే ఈఎన్టీ వైద్యులు దగ్గరకు పరుగు పరుగున వెళ్లారు. ఈ క్రమంలో ఈవీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 20, 2025, 02:22 PM IST
  • బాలుడి ముక్కులో జలగ..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
Viral Video: బాప్ రే.. బాలుడి ముక్కులో జలగ.. షాకింగ్‌కు గురైన డాక్టర్లు.. వీడియో వైరల్..

Worm from boy nose in Kashmir video viral: సాధారణంగా జలపాతాలు,నదులు, చెరువుల దగ్గరకు చాలా మంది స్నానాలకు వెళ్తుంటారు. కొన్నిసార్లు నీళ్లలో ఉండే జలగలు, పురుగులు బట్టలలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్నిసార్లు తెలియకుండా.. నీళ్లు మింగడం వల్ల డైరెక్ట్ గా కడుపులోకి కూడా వెళ్లిపోతాయి. అయితే..ఇటీవల ఒక బాలుడి ముక్కులో నుంచి జలగ బైటకు వచ్చింది. ఈఘటనతో బాలుడి కుటుంభం భయంతో ఈఎన్టీ డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టారు.

Add Zee News as a Preferred Source

ఈ వీడియో వైరల్గా మారింది. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల ఎంఎంఏబీఎం అసోసియేటెడ్ ఆస్పత్రిలో ఇటీవల ఒక బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చారు. తన ముక్కులో ఏదో కదులుతుందని డాక్టర్ లను కలిశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈఎన్టీ వైద్యులు బాలుడి ముక్కులో ఏదో పాములాంటిది ఉన్నట్లు గుర్తించారు.

 

వెంటనే.. సక్షన్ ప్రక్రియ ద్వారా ముక్కు నుంచి 9 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుతో పాములాగ ఉన్న వార్మ్‌ను బయటకు తీశారు. ఈ ఘటన చూసి వైద్యులు సైతం విస్తూపోయారు. అది అసలు ముక్కులోకి ఎలా వెళ్లిందని తలలు పట్టుకుంటున్నారు. 

Read more: Monalisa Video: తల్లిని ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేసిన కుంభమేళ బ్యూటీ.. మోనాలీసాపై నెటిజన్ల ప్రశంసలు.. వీడియో వైరల్..

కుటుంబ సభ్యులు.. బాలుడు కొన్ని రోజులుగా ఏంఫుడ్ తినట్లేదని, బరువు కూడా తగ్గిపోతున్నాడని వైద్యులకు చెప్పారు. అసలు.. ముక్కులోకి ఆ వార్మ్ ఎలా వెళ్లిందో ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  

గతంలో యూపీలో కూడా ఇలాంటి ఘటన సంభవించింది. వైద్యులు ఒక వ్యక్తి ముక్కు నుంచి ఒక వార్మ్ ను తొలగించారు. కానీ అసలు.. వార్మ్.. ముక్కులోకి ఎలా వెళ్లిందనేదే అంతు చిక్కని ప్రశ్నగా చెప్తున్నారు. మొత్తంగా ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. నీళ్లలోకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News