Dog attacks on Leopard Video: అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో తరచుగా క్రూర జంతువులు వస్తుంటాయి. చిరుతలు, పులులు,సింహలు, ఏనుగులు, ఎలుగు బంట్లు, పాములు ఇటీవల గ్రామాల్లోకి రావడం వంటి వార్తలను చూస్తున్నాం. ఈ క్రమంలో అవి వేటలో భాగంగా రాత్రి పూట మనుషుల మీద దాడులకు దిగుతున్నాయి.
చాలా సార్లు చిరుతలు.. పెంపుడు శునకాలపై దాడులు చేసిన ఘటనలు వార్తలలో నిలిచాయి. మెల్లగా చిరుతలు అడవికి దగ్గరగా ఉన్న ఇళ్లలో ఎంట్రీ ఇచ్చి.. చప్పుడు చేయకుండా వచ్చి దూడను లేదా మేకల్ని, శునకాల్ని అమాంతం పట్టుకుని తుర్రున మాయమౌతుంటాయి.ఈ క్రమంలో ప్రస్తుతం అదే ప్లాన్ మీద వచ్చిన ఒక చిరుతకు శునకం చుక్కలు చూపించింది.
ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. చిరుత రాత్రి పూట మెల్లగా ఒక ఇంట్లోకి ప్రవేశించింది.అయితే.. అక్కడ ఒక గద్దెమీద శునకం కూర్చుని ఉంది. అది నల్లగా ఉండటం వల్ల చిరుత దాన్ని గమనించలేదు. కానీ ఏదో అలికిడి కావడంతో శునకం మెల్కొని ఒక్కసారిగా చిరుత మీద గట్టిగా అరిచింది.దీంతో చిరుత పులి బ్రతుకు జీవుడా అంటూ.. స్పీడ్ గా అక్కడి నుంచి పారిపోయింది.
ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు శునకం ధైర్యానికి ఫిదా అవుతున్నారు. శునకం డేర్ చేయకుంటే... పరిస్థితి మరోలా ఉండేదని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read more: Viral Video: సెల్ఫీ కోసం యువతి అత్యుత్సాహం.. రెప్పపాటులో జింక ఏంచేసిందో తెలుసా..?.. వీడియో వైరల్..
ఇటీవల కాలంలో జనాలు క్రమంగా అడవుల్లోని చెట్లను నరికేస్తున్నారు. దీంతో అడవిలో జంతుజాలాలు తగ్గిపోవడం వల్ల.. వేట కోసం, తాగునీటి కోసం క్రూర జంతువులు.. అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవికి సమీపంలోని గ్రామాల ప్రజలురాత్రి పూట చాలా జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ సిబ్బంది తరచుగా హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో క్రూర జంతువుల దాడుల్లో.. ఇటీవల చాలామంది అమాయకులు తమ ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.









