Drunk girl stands on running bike in Bhopal video: ఇటీవల కాలంలో కొంత మంది యువత బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రోడ్ల మీద బైక్ లు, కార్లతో రకరకాల స్టంట్ లు చేస్తు రెచ్చిపోతున్నారు. రోడ్ల మీద ఇష్టమున్నట్లు అమ్మాయిల్ని ఎక్కించుకుని రొమాన్స్ చేస్తున్నారు. తప్పతాగి ఇష్టమున్నట్లు బైక్ లు నడిపిస్తు ఇతరులను కూడా డెంజర్ లో నెట్టేస్తున్నారు. కొంత మంది యువత ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ముఖ్యంగా వీకెండ్ , రాత్రిళ్లు కాగానే.. బైక్ ల మీద ఇష్టమున్నట్లు తిరుగుతున్నారు. తప్పతాగి.. తమ లవర్ లతో స్పీడ్ గా డ్రైవింగ్ లు చేస్తు హల్ చల్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనల్లో చాలా సార్లు యువత తమ ప్రాణాలను రిస్క్ లో వేసుకొవడమే కాకుండా.. అమాయకుల్ని కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సైతం.. తాగి ఇష్టమున్నట్లు వాహానాలు నడపొద్దని కూడా తరచుగా హెచ్చరికలు జారీ చేస్తునే ఉన్నారు. అయిన కూడా యువత ఏ మాత్రం మారడంలేదు.
ఇప్పటి వరకు అనేక వీడియోలు తరచుగా యువత.. రోడ్డు మీద బైక్ ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. హగ్ లు చేసుకున్న అనేక వీడియోలు వైరల్ గా మారాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న యువత మారటం లేదు.. తాజాగా.. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తున్నారు. ముగ్గురు కూడా తప్పతాగి ఉన్నారు.
#नशे में टल्ली ययुवती बाइक पर kisi करती आई नज़र.#भोपाल का एक वीडियो सामने आया है.. जिसमें नशे में टल्ली #युवक-युवतियां तेज़ रफ्तार बाइक पर झूमते हुए नजर आ रहे हैं..जिसमें लड़की फ्लाइंग kiss करती दिखाई दे रही है..#Bhopal #flyingkiss pic.twitter.com/6msjz75rq1
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) February 28, 2025
యువకుల ఇద్దరి మధ్యలో యువతి ఉంది.. ఆమె రన్నింగ్ బైక్ మీద లేచి నిలబడి.. కారులో పక్కనుంచి వెళ్తున్నవారికి ఫ్లయింగ్ కిస్ లు ఇస్తుంది. ఈ వీడియోను కారులో ఉన్న వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









