Drunk School Teacher Dance Video: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని షేఖాపూర్ గ్రామంలోని ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్ వర్మ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో ఫుల్‌గా మద్యం తాగి డ్యూటీకి వచ్చాడు.
అలా తాగిన మత్తులోనే విద్యార్థుల ముందు డ్యాన్స్ చేస్తున్నాడు. పిల్లలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయమై పిల్లల నుండి పదే పదే ఫిర్యాదులు వస్తున్న క్రమంలో వారి తల్లీదండ్రులు పాఠశాలకు వెళ్లి వీడియో రికార్డు చేశారు.
స్థానికుల సమాచారం మేరకు.. అనంత్ వర్మ అనే ఉపాధ్యాయుడు ప్రతిరోజూ పాఠశాలకు తాగి వచ్చేవాడట. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బదులుగా వారితో అసభ్యకరమైన భాషను ఉపయోగించేవాడట. ఈ ప్రవర్తనతో పిల్లలు చాలా రోజులుగా ఇబ్బంది పడిన క్రమంలో తాజాగా వారి తల్లీదండ్రులకు ఫిర్యాదు చేశారట.
Also Read: Pini Village Women: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు..భారత్‌లోనే వింతైన గ్రామం..ఎక్కడుందో తెలుసా?
తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చినప్పుడు కూడా ఆ టీచర్ ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. దీంతో వారు ఓ మొబైల్‌లో వీడియో రికార్డు చేశారు. మద్యం మత్తులో తిక్కగా మాట్లాడడం సహ పేరెంట్స్ ముందు ఆ టీచర్ డ్యాన్స్ చేస్తూ పడిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nanded | शिक्षकी पेशाला काळिमा! दारू पिऊन शाळेत शिक्षकाचा धिंगाणा; विद्यार्थ्यांसोबतही गैरवर्तन#Nanded #MaharashtraNews #DailyNewsUpdates pic.twitter.com/f8qPkwmmNx
— Navarashtra (@navarashtra) December 7, 2025
మద్యం తాగిన మత్తులో స్కూల్ టీచర్..
ఈ సంఘటనపై గ్రామంలోని ప్రజలకు టీచర్‌పై ఆగ్రహం పెల్లుబికింది. మద్యం మత్తులో పిల్లల ముందు ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ తరానికి ఎలాంటి విద్య అందుతుందని వారు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై జిల్లా పరిషత్ విద్యా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా పరిషత్ విద్యా యంత్రాంగం వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో ఉపాధ్యాయుడి ప్రవర్తనను గమనించిన తర్వాత రాష్ట్ర విద్యా శాఖ అనంత్ వర్మను సస్పెండ్ చేసింది. తదుపరి శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









