
Drunk woman creates ruckus on Haridwar highway video: ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాలలో కూడా పురుషులకు సమానంగా పోటీనీ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పురుషులను కూడా దాటేశారని చెప్పుకొవచ్చు. ఇంకా ఒకప్పుడు మహిళలు వేధింపులకు గురయ్యేవారు. పురుషులు తాగి వచ్చి మహిళల్ని వేధించే వారు. కానీ ఇప్పుడు మహిళలు సైతం.. తమ భర్తల్ని రాచి రంపాన పెడుతున్నారు.
ఎక్కతక్కా మాట్లాడితే.. చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటీవల అనేక ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. చాలా మంది భర్తలు తమ భార్యలు పెట్టే టార్చర్ లను భరించలేక సెల్పీ వీడియోలు తీసుకుని మరీ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు.
#Haridwar
Dehli Dehradun Highway.
High voltage drama of a drunk woman.
She stopped every vehicle finally stopped a traffic police man & Rided on his scooty????#Uttarakhand #SpringRenewal #WomenEmpowerment #Viralvideo #vaibhavsuryavanshi #RupaliGanguly #IPL2025 pic.twitter.com/RWn1Q288zf— Sunaina Bhola (@sunaina_bhola) April 20, 2025
ఈ క్రమంలో మహిళలు, యువతులు కూడా తప్పతాగి రోడ్డు మీద న్యూసేన్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఒక యువతి రోడ్డుమీద తాగిన మైకంలో రచ్చ రచ్చ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గామారింది.
ఉత్తరాఖండ్ లోని హరీద్వార్ లో యువతి తప్పతాగి రచ్చ రచ్చచేసింది. డెహ్రడూన్, ఢిల్లీ హైవే మీద ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి ఫుల్ గా తాగి వచ్చి రోడ్డు మీదకు వచ్చింది. అక్కడ వచ్చి పోయే వాహానాలు ఆపి దాని పైన ఎక్కి న్యూసెన్స్ చేసింది. కార్లను ఆపుతు.. రోడ్డుమీద పడుకుని, తూలుతు నానా రభస చేసింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అక్కడున్న కొంత మంది యువతికి నచ్చ చేప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఫుల్ గా తాగి ఉండటం వల్ల ఎవరి మాటలు పట్టించుకొకుండా.. ఇష్టమున్నట్లు ప్రవర్తించింది.
చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. యువతిని మహిళ పోలీసులతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకుని, ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చారు. మొత్తంగా ఆమె రోడ్డు మీద కొన్ని గంటల పాటు వీరంగం సృష్టించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe