)
Woman denied entry to hindu temple for wearing shorts video: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా పండగ సంబరాలు అంబారాన్ని అంటాయి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తొమ్మిది అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో దసరా వేళ చాలా మంది ఎంతో సంప్రదాయ బద్దంగా వస్త్రాలు ధరిస్తారు. ఇతర సమయాల్లో ఎలా ఉన్న నవరాత్రుల్లో మాత్రం కొంచెం ట్రెడిషన్ గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు.
ఇటీవల అనేక దేవాలయాల్లో ట్రెడిషన్ వస్త్ర ధారణ ఉండాలనిబోర్డులు ఏర్పాటు చేశారు. అమ్మాయిలు తప్పకుండా చున్నీతో, అబ్బాయిలు ధోతి లేదా పైన షర్ట్ తీసి ప్యాంట్ తో దర్శనానికి రావాల్సి ఉంటుంది.
చెడ్డీలు,లెగ్గింగ్స్ తో వస్తే దర్శనాలను కొన్ని చోట్ల అనుమతి ఇవ్వడంలేదు. ఈ క్రమంలో ఒక యువతి చెడ్డీ వేసుకుని గుడిలోకి వెళ్లి అక్కడ రూల్స్ పాటించకుండా అక్కడి వారితో గొడవలకు దిగింది. ఈ వీడియో వైరల్గా మారింది.
యువతి చెడ్డీ వేసుకుంది. దీంతో అక్కడున్న పూజారులు,పోలీసులు ఆమెను వారించారు.చెడ్డీపై ఆలయంలోకి ప్రవేశంలేదని తెల్చి చెప్పారు. అయితే ఆమె దీన్ని విన్పించుకోలేదు. ఇది రూల్ మీరు పెట్టారని, ఫస్ట్ నుంచి లేదని వారితో కయ్యానికి కాలు దువ్వింది.
ఎంత చెప్పిన కూడా ఆమె తన మొండిపట్టు మాత్రం వీడలేదు. మొత్తంగా ఆమెను అక్కడి నుంచి లేడీ పోలీసులు వారించి బైటకు పంపించి వేశారు. కానీ ఆమె మాత్రం గట్టిగట్టిగా అరుస్తు అక్కడి వారితో గొడవలకు దిగింది. అక్కడున్న వారు అమ్మాయి రచ్చను వీడియో తీశారు. ప్రస్తుతం అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.