)
Snake Video Watch: సాధారణంగా పాములు పట్టడం ఒక రిస్కీ జాబ్.. కానీ ప్రస్తుతం చాలామంది దీనిని వృత్తిగా చేసుకుని వేల రూపాయలు సంపాదిస్తున్నారు ముఖ్యంగా పాములు పట్టుకునే సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది అయితే పాములు పట్టే ప్రత్యేకమైన శిక్షణను పొందుతున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రోడ్లమీద పోయే పాములను పట్టుకొని వీడియోలుగా చిత్రీకరించి పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటివరకు కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకు వచ్చాయి. అలాగే జనాలు కూడా పాములకు సంబంధించిన వీడియోలు ఇష్టంగా చూస్తున్నారు. దీంతో షేర్ చేసిన పాములకు సంబంధించిన వీడియోలు లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అయితే తాజాగా కూడా ఇలాంటి ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలంటే తెలుసుకుందాం.
ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వృద్ధుడు తనకు పాము కాటేసిందని కోపంతో ఆ పామును దొరకబట్టి మరి మెడలో వేసుకొని వీధుల్లో తిరుగుతూ గ్రామస్తులకు చూపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటననే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆ వృద్ధుడు మత్తులో ఉండగా పాము కరిసింది.. దీంతో దానిపై ఉన్న కోపంతో ఈ పని చేశాడని గ్రామస్తులు చెబుతున్నారు.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వృద్ధుడు మద్యం మత్తులో పాముని పట్టుకొని దానిని మెడలో వేసుకొని అటు ఇటు తిరగడం మీరు చూడొచ్చు. అలాగే రోడ్డు పై వెళ్తున్న వారు కూడా అతడిని చూసి బైక్ ఆపుకొని మరి.. అలాగే కొద్దిసేపు ఏం జరుగుతుందోనని అక్కడ చూస్తుండి పోయారు. లుంగీ ధరించిన ఆ వ్యక్తి పామును మెడలో వేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిరిగాడు. అలాగే అక్కడున్న కొంతమందికి ఆ పామును చూపించి.. అది తన చూపుడువేలును కరిచిందని వివరించాడు. అయితే అతను మద్యం మత్తులో ఉండి ఇదంతా చేశాడని స్థానికులు గమనించి.. పామును వదిలిపెట్టమని కోరారు.
దీంతో మద్యం మత్తులో ఆ పామును… pic.twitter.com/fxpmglQxWh
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2025
ఆ వృద్ధుడు చివరికి అటు ఇటు తిరిగేసి.. ఆ పావును ఒకచోట వదిలిపెట్టాడు.. ఇదంతా చూసి ఎందుకు.. అక్కడికి చాలామంది వచ్చారు. అయితే వెంటనే ఆ వృద్ధుడిని ఆసుపత్రికి ఇంత తరలించినట్లు సమాచారం. మద్య మత్తులో ఉండడం కారణంగానే ఇలా.. పాముని పట్టుకొని అటు ఇటు తిరిగాడని స్థానికులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook