
Elephant attacks on bus at high mountain video: సాధారణంగా అడవిలోని జంతువులు చాలా క్రూరంగా ఉంటాయి. వాటి ఆవాసాల్లోకి ఇతర జంతువులు వస్తే అవి అస్సలు భరించ లేకుండా ఉంటాయి. సింహాలు, పులులు, ఏనుగులు మొదలైన జంతువులు వాటి ఆవాసంలో అవి నివసిస్తుంటారు. ఇతర జంతువులు లేదా మానవులు ఎవరైన వాటిని డిస్టర్బ్ చేస్తు వాటి తడాఖా చూపిస్తాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఏనుగులు చాలా బలంగా ఉంటాయి. సింహాలు, పెద్ద పులులు సైతం ఏనుగుల జోలికి పోయేందుకు తెగ భయపడిపోతాయి. అవి పొడవైన తొండంతో పాటు, పెద్ద పెద్ద చెవులు, దంతాలతో చూస్తేనే కింద తడిసిపోతుంది. అలాంటిది ప్రస్తుతం ఒక ఏనుగు ఆవేశంతో రెచ్చిపోయింది. మరీ దాని దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టారో.. లేదా అదే అడవికి దగ్గరగా ఉన్న రోడ్డు మీదకు వచ్చిందో కానీ.. మొత్తంగా ఒక వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
ఎత్తైన కొండ మీద బస్సు ఉంది. ఇంతలో అక్కడికి ఒక భారీ ఏనుగు వచ్చింది. మరీ దానికి బస్సును చూడగానే చిర్రెత్తుకొచ్చిందో ఏంటో కానీ.. అది తన తొండంతో బస్సు మీద బలంగా దాడికి దిగింది. బస్సు పక్కనే లోతైన లోయ కూడా ఉంది. ఏనుగు బస్ ను బలంగా లోయలోకి నెట్టింది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మరీ బస్సులో ఉన్న వాళ్ల లక్ బాగుందో ఏంటో కానీ.. ఏనుగు కాసేపటి తర్వాత శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కానీ.. బస్సులో ఉన్న వాళ్లంతా ప్రాణ భయంతో అరుపులు, కేకలు పెట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఏనుగు బస్సు మీద ఎంత కోపంతో దాడిచేసిందని ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.