)
Elephant attacks on people who enjoying picnic video: సాధారణంగా చాలా మంది వీకెండ్ వచ్చిందంటే చాలు కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది అడవుల్లోకి వెళ్తారు. మరికొంత మంది ఎత్తైనజలపాతాలు, గ్రీనరీ ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తారు. అడవులకు దగ్గరగా ఉండే ప్రదేశాల్లోకి కూడా వెళ్తారు.
ఈ క్రమంలో కొన్నిసార్లు అడవిలోని జంతువులు టూరిస్టుల మీద దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. అడవి ప్రాంతంలోకి వెళ్లి తమకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ లను కొంత మంది వండుకుని ఎంజాయ్ చేస్తుంటారు.
Tell me whose mistake it is. Why to chose location for picnic where the elephants are moving usually. In search of beautiful location please don’t put life in danger. pic.twitter.com/heteJAk0rt
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 13, 2025
ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అడవుల సమీపంలో చోటు చేసుకుంది. ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు . దీంతో అది కాస్త వైరల్ గా మారింది.
కొన్ని కుటుంబాలు అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశంలోకి పిక్నిక్ కు వెళ్లారు. కొంత మంది కారులో డ్రైవింగ్ చేస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతలో దట్టమైన అడవి నుంచి ఏనుగు ఒకటి బైటకు వచ్చింది. అది కోపంతో వారిమీదకు స్పీడ్ గా వచ్చి దాడిచేసేందుకు ప్రయత్నించింది.
వెంటనే అక్కడి వారు గట్టిగా అరుస్తు.. గిన్నెల చప్పుడు, కారులో హరన్ మోత మోగించడంతో ఏనుగు మరల బెదిరిపోయి అడవుల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. ఈ ఘటన గతంలోనే చోటు చేసుకుంది. మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.