Elephants Attack video: దేవుని ఉత్సవాలలో ఏనుగుల బీభత్సం.. జనాలను తొండంతో ఎత్తిపడేసిన గజరాజులు.. వీడియో వైరల్..

Kerala Elephant Attacks: కేరళలో ఏనుగులు ఆలయంలోని ఉత్సవాలలో రచ్చ చేశాయి. ఒక్కసారిగా అక్కడున్న వారు టపాసులు పేల్చడంతో రెండు ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. అడ్డం వచ్చిన వాళ్లను తొక్కు కుంటూ ముందుకు వెళ్లిపోయాయి.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 14, 2025, 02:52 PM IST
  • కేరళలో ఆలయంలో ఏనుగుల దాడి..
  • భయాందోళనతో పరుగులు పెట్టిన భక్తులు..
Elephants Attack video: దేవుని ఉత్సవాలలో ఏనుగుల బీభత్సం.. జనాలను తొండంతో ఎత్తిపడేసిన గజరాజులు.. వీడియో వైరల్..

Elephants attacks in kerala temple video viral: సాధారణంగా ఉత్సవాలలో, దేవుని కార్యక్రమాలలో ఏనుగులను తీసుకొస్తుంటారు. వీటిని అందంగా అలంకరణ చేసి.. ఉత్సవ విగ్రహాలను ఏనుగులపై పెట్టి ఊరేగిస్తుంటారు. అంతే కాకుండా.. ఏనుగుల మీద దేవుళ్లను పెట్టి.. తొండంతో భక్తుల్ని ఆశీర్వాదం ఇచ్చేలా మావాటి వాళ్లు చేస్తుంటారు. ఏనుగుల పక్కన మావటివాళ్లు ఉంటూ వాటిని కంట్రోల్ చేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

అయితే.. కొన్నిసార్లు ఏనుగుల దగ్గరకు కొంత మంది ఫోటోల కోసం వెళ్తుంటారు. మరికొందరు టపాసులు కాలుస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో ఏనుగులు కోపంతో రెచ్చిపోతుంటాయి. అవి అదుపుతప్పి దాడులు సైతం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటన వైరల్గా మారింది. దీనిలో కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో విషాదం నెలకొంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా  పీతాంబరం, గోకుల్ అనే రెండు ఏనుగుల్ని తీసుకొచ్చారు. అయితే.. అక్కడ ఉత్సవాలలో కొంత మంది యువత టపాసులు కాల్చారు.

 

ఆ ఏనుగులు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టాయి. మావటి వాళ్లు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ఆ ఏనుగులు అదుపు తప్పాయి. చాలా సేపు అటు ఇటు తిరుగుతూ.. కన్పించిన వాళ్ల మీద దాడులు చేస్తు ముందుకు వెళ్లిపోయాయి. ఏనుగుల్ని చూసి భయంతొ భక్తులు దూరంగా పరుగులు పెట్టారు. ఆ ఏనుగుల కాళ్ల కింద పడి.. ముగ్గురు భక్తులు చనిపోయారు. దాదాపు.. 40 కిపైగా మంది  భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Read more: Whale Viral Video: వీడియో చూస్తే గుండెలు గుభేల్.. తండ్రి కళ్ల ముందే కొడుకును మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్..?

వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఏనుగుల బీభత్సం చేస్తున్న వీడియోలు అక్కడున్న సీసీ కెమెరాలోరికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల కాలంలో కేరళలో ఆలయంలోని ఉత్సవాలలో ఏనుగులు బీభత్సం చేయడం తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఏనుగులు ఉన్నప్పుడు టపాసులు, ఫోటోలు తీయడం వంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News