Elephant rescued drowning gazelle at zoo emotion video: సాధారణంగా మన చుట్టుపక్కలకొంత మంది మనుషుల్లో మానవత్వం పోయిందని చెప్పుకొవచ్చు. ఎవరైన ప్రమాదంలో ఉండే వాళ్లను అస్సలు పట్టించుకోరు. మనం తరచుగా రోడ్ల మీద వెళ్లినప్పుడు కొన్నిసార్లు అనుకొని ప్రమాదాలు జరుగుతాయి. చాలా తక్కువ మంది అలాంటి సమయంలో స్పందిస్తారు. తమకు ఏంపని అంటూ మరికొంత మంది వెళ్లిపొతుంటారు.
కానీ మనుషుల కన్నా.. కొన్ని సంఘటనలలో నోరులేని జీవాలే బెటర్ అని చెప్తుంటారు. ఒక మూగ జంతువుకు ఏదైన ఆపద వస్తే.. వాటి గుంపు అంత ఒకచోటకు వస్తుంది. పోరపాటున అడవిలో తమ జాతీ జంతువుకు ఇతర జంతువులు కీడు తలపెడితే.. అన్ని మూకుమ్మడిగా పోరాటం చేస్తాయి. ఇక కొన్ని జంతువులు చనిపోతే... మిగతా జంతువులు కూడా వాటి చుట్టు వచ్చి చేరి.. కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు కొకొల్లలు.
అయితే... ప్రస్తుతం ఒక జూలో ఒక ఏనుగుల గుంపు, పక్కనే జింకలు ఉన్నాయి. అయితే.. వాటిలో ఒక జింక నీళ్లలోకి దిగింది. కానీ పైకి రావడాని తెగ ఇబ్బందులు పడుతుంది. దీన్ని అక్కడున్న ఒక ఏనుగు గమనించింది. వెంటనే జింక దగ్గరకు వెళ్లి తన తొండంతో జింకను బైటకు తీసింది. ఏనుగు అందించిన సాయంతో.. జింక నీటి నుంచి బైటకు తన ప్రాణాలు కాపాడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ అవుతున్నారు. ప్రస్తుతం మనుషులు.. ఒకరి ప్రాణాల్ని కాపాడటం అటుంచి.. ఎప్పుడు కూడా ఒకర్ని ఇబ్బందుల్లో నెట్టివేయాలో అంటూ గోతికాడ నక్కలాగా కాచుకుని ఉంటారు. అలాంటి ప్రస్తుత సమాజంలో ఇలాంటి నీచుల మనస్తత్వం ఉన్న మనుషుల కన్నా.. నోరులేని జీవాలు నయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మనుషుల రూపంలో ఉండి.. వారి పనులు పశువుల కన్నా.. హీనంగా ఉంటాయి. అలాంటి వారు.. ఆ మూగజీవాల్ని చూసి తమ గుంటనక్కల వంటి వంకర బుద్దిని మార్చుకొవాలని నెటిజన్లు చురకలు పెడుతు కామెంట్లు చేస్తున్నారు.









