Elephants cooking food video goes viral: ఏనుగు చాలా బలమైన జంతువని చెప్తుంటారు. కానీ చాలా మంది ఇటీవల క్రూర జంతువల్ని సైతం మంచిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏనుగుల్ని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు ఉపయోగించుకుంటున్నారు. అయితే.. ఇటీవల ఏనుగులు కొన్నిసార్లు దాన్ని పెంచుకున్ను యజమానులపైకి దాడికి దిగుతున్నాయి. ఉత్సవాలకు తీసుకెళ్లిన ఏనుగులు సైతం బ్యాండ్ లు, టపాకాయల చప్పుళ్లకు భయపడి పోయి దాడులు అక్కడున్న వారి మీద దాడులు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఏనుగుల ఫన్నీవీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చాలా వరకు ఏనుగుల చేష్టలు నవ్వుతెప్పించేవిగాను ఉంటాయి. ముఖ్యంగా ఏనుగులను చూస్తే చాలా మంది భయంతో దూరంగా పారిపొతున్నాయి. అవి ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాయో ఎవరు చెప్పలేరు. అప్పటి దాక మంచిగా ఉన్న ఏనుగులు కాస్త.. ఒక్కసారిగా వాటి క్రూరత్వంను బైటపెడుతున్నాయి. తాజాగా.. ఒక ఏనుగు ఫన్నీవీడియో వైరల్ గా మారింది. దీనిలో ఒక మహిళ ఏనుగును మచ్చిక చేసుకుంది.
దానిలో అన్ని పనులు చేయిస్తుంది. ఏకంగా తన ఇంట్లో చెఫ్ మాదిరిగా చేసింది. మొక్కై వంగునదీ.. మానైవంగునా అనుకుందో ఏంటో కానీ.. గజరాజుకు చిన్నతనంనుంచి భలే ట్రైనింగ్ ఇచ్చినట్లుంది. మొత్తంగా ఏనుగు ఆ మహిళ ఏల చెబితే అలా చేసింది. మహిళ ఏనుగు రోలులో మసాల దినుసులు సైతం దంచిపిస్తుంది.
అంతేకాకుండా.. ప్రత్యేకమైన అప్పడాలను కూడా ఏనుగు ఏనుగుతో వేయిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏనుగుకు భలే ట్రైనింగ్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో థాయిలాండ్ కు చెందినదిగా సమాచారం.









