)
Elephat brutally Attacks on Crocodile Trending Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వులు తెప్పించేవిగా ఉంటే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఇటీవల జంతువుల వీడియోలు ట్రెండింగ్ గా మారాయి. పాముల వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. అయితే.. సింహాన్ని అడవికి రాజుగా చేప్తారు. అంతే కాకుండా ఇక్కడ దీనికి స్థానబలం ఎక్కువగా ఉంటుందంటారు.
నీటిలో మొసలికి స్థానబలం ఎక్కువంటారు. నీటి సామ్రాజ్యంకు మొసలిని రాజుగా కూడా చెబుతుంటారు. భారీ జంతువులు కూడా నీటిలోకి వెళ్తే మొసళ్లు దాడులు చేస్తాయి. మొసలికి నీటిలో పది ఏనుగుల బలం ఉంటుందంటారు. అందుకే నీటిలో మొసళ్లు కన్పిస్తే.. మనుషులే కాదూ... భారీ జంతువులు, సైతం భయపడిపోతాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఒక ఏనుగుల గుంపు నీటిని తాగేందుకు అడవికి వెళ్లింది. అప్పుడు నీటిలో కొన్ని మొసళ్లు ఉన్నాయి.
— Wildlife Uncensored (@TheeDarkCircle) September 5, 2025
అడవిలో అనేక రకాల జంతువులు తరచుగా నీళ్లను తాగేందుకు నీళ్లలోకి దిగుతుంటాయి. అచ్చం ఇలాంటి విధంగానే ఏనుగుల గుంపు నీళ్లలోకి దిగింది. అప్పటికే ఏనుగులు గుంపు దానిలో ఉన్నాయి. అవికాస్త ఏనుగులపై దాడి చేశాయి. ఒక ఏనుగుపై భారీ మొసలి దాడి చేసింది. దీంతో దానికి చిర్రెత్తుకొచ్చింది.
అంతే కాకుండా.. నా మీదనే దాడి చేస్తావా అంటూ.. మొసలితో ఖతర్నాక్ ఫైటింగ్ కు దిగింది. తన తొండంతో మొలిసి పట్టుకుని నీళ్లలోకి విసిరి కొట్టింది. బలమైన కాళ్లతో.. మొసలిని తొక్కిపెట్టి మరీ దానికి చుక్కలు చూపించింది.
ఏనుగు బీభత్సమైన దాడికి.. మొసలి విలవిల్లాడిపోయింది. చివరకు మొసలి ప్రాణాలు కూడా విడిచింది. ఈ అరుదైన ఘటనను దూరం నుంచి కొంత మంది ఫారెస్ట్ సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తవైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతే కాకుండా.. ఏనుగు చుక్కలు చూపించిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.